బాబు మగ వగలాడి .. పోసాని పవర్ పంచ్ !       2018-06-12   02:58:01  IST  Bhanu C

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకి కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టం. సినిమాల్లోనూ… నిత్య జీవితంలోనూ ఒకే విధమైన బాడీ లాంగ్వేజ్ తో ఉండడం పోసాని కి మాత్రమే చెల్లింది. కొంతకాలంగా ఆయన వైసీపీ తరపున మాట్లాడుతూ.. అనేక మీడియా చర్చల్లో కూడా పాల్గొంటూ టీడీపీ , చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నాడు. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ పెట్టారు.

-

ఎన్టీఆర్ పార్టీ.. జెండా. లాక్కున్న మగ వగలాడి చంద్రబాబు అని పోసాని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవటమే ఆయన ఆరాటమని ఓటుకి నోటులో దొరికి.. విజయవాడ పారిపోయిన బాబుకి.. అభివృద్ధి చేయాలనే ఆరాటమెక్కడిదని ఆయన విమర్శించారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని .. అలాంటి వ్యక్తికి నీతి, నిజాయితీ అంటూ మాట్లాడే అర్హత ఏముంది? అని ప్రశ్నించారు.

‘బాబుకి ఓటేస్తే కమ్మ కులానికి.. కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అంటున్నావు. అసలు బీజేపీ అంటరాని పార్టీ అనా.. మీ ఉద్దేశ్యం. ఇన్నాళ్లు బీజేపీ కాళ్ళు నాకిన నీవు, బీజేపీ తో కలవను.. తప్పు అయ్యింది అని పోసాని తీవ్రంగా విమర్శించారు.. తర్వాత మోడీ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిశావ్. ఇప్పుడు మోడీని తిడుతున్నావ్. ఏం మారినట్టు మోడీ. పదవి. నీ సీట్ కోసం ఎవరినైనా చంపుతావ్’ అంటూ బాబుపై పోసాని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లో ఓడిపోయి టీడీపీలో చేరిన చంద్రబాబు ఆ పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని పోసాని ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దని అన్నది నువ్వే.. ఇప్పుడు హోదా ఇవ్వు అంటే ఇస్తాడా..? జగన్ ని జైల్లో పెడితే. మళ్ళీ గెలవచ్చు అని బాబు ఆలోచిస్తున్నాడని. 15 కేస్ ల పై స్టే తెచ్చుకున్న నువ్వు జగన్ కి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసలు నీవు ఎంతమందిని మేనేజే చేసుకున్నావ్.. కేసీఆర్ కి ఒక్క శాతం మానవత్వం లేకుంటే.. జైల్లో ఉండేవాడివని ఆయన ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ చాలా అమాయకుడని అందుకే.. సీనియర్ అని బాబుకి మద్దతు ఇచ్చాడని.. రాజకీయాల్లో సీనియారిటీ కాదు.. సిన్సియార్టీ కావాలని పోసాని వివరించారు. ఓ వర్గం మీడియాకి కులం పిచ్చి పట్టిందని.. జగన్ ని ఆ మీడియాలు చంపేశాయని.. సాక్షి లేకుంటే. జగన్ అండమాన్ లో ఉండేవారని పోసాని చెప్పుకొచ్చాడు. తానొక ఓటరుగానే మాట్లాడుతున్నాననన్న ఆయన ప్రస్తుతం ఉన్న నాయకుల్లో జగనే బెటర్ అని తన నమ్మకమని చెప్పారు. రుణమాఫీ చేస్తానని జగన్ ఒక మాట అని ఉంటే .. 2009లో జగన్ ఖచ్చితంగా గెల్చేవాడని పోసాని అన్నారు. చంద్రబాబుకు తప్ప .. ఏపీలో పవన్ కళ్యాణ్ సహా అందరకీ సొంత జెండాలున్నాని విమర్శలు గుప్పించారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.