బాబు మగ వగలాడి .. పోసాని పవర్ పంచ్ !     2018-06-12   02:58:01  IST  Bhanu C

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకి కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టం. సినిమాల్లోనూ… నిత్య జీవితంలోనూ ఒకే విధమైన బాడీ లాంగ్వేజ్ తో ఉండడం పోసాని కి మాత్రమే చెల్లింది. కొంతకాలంగా ఆయన వైసీపీ తరపున మాట్లాడుతూ.. అనేక మీడియా చర్చల్లో కూడా పాల్గొంటూ టీడీపీ , చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నాడు. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ పెట్టారు.

ఎన్టీఆర్ పార్టీ.. జెండా. లాక్కున్న మగ వగలాడి చంద్రబాబు అని పోసాని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవటమే ఆయన ఆరాటమని ఓటుకి నోటులో దొరికి.. విజయవాడ పారిపోయిన బాబుకి.. అభివృద్ధి చేయాలనే ఆరాటమెక్కడిదని ఆయన విమర్శించారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని .. అలాంటి వ్యక్తికి నీతి, నిజాయితీ అంటూ మాట్లాడే అర్హత ఏముంది? అని ప్రశ్నించారు.

‘బాబుకి ఓటేస్తే కమ్మ కులానికి.. కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అంటున్నావు. అసలు బీజేపీ అంటరాని పార్టీ అనా.. మీ ఉద్దేశ్యం. ఇన్నాళ్లు బీజేపీ కాళ్ళు నాకిన నీవు, బీజేపీ తో కలవను.. తప్పు అయ్యింది అని పోసాని తీవ్రంగా విమర్శించారు.. తర్వాత మోడీ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిశావ్. ఇప్పుడు మోడీని తిడుతున్నావ్. ఏం మారినట్టు మోడీ. పదవి. నీ సీట్ కోసం ఎవరినైనా చంపుతావ్’ అంటూ బాబుపై పోసాని మండిపడ్డారు.