వామ్మో... పోసాని మళ్లీ మొదలు పెట్టబోతున్నాడట, పారిపోండ్రోయ్‌     2019-01-04   14:40:56  IST  Ramesh Palla

రచయితగా, దర్శకుడిగా ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు పోసాని కృష్ణమురళి గత కొంత కాలంగా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న ఈయన తాజాగా దర్శకత్వం వైపుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అవుతూ వచ్చాయి. దాంతో దర్శకత్వంకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ దర్శకత్వం వైపుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈయన చేయబోతున్న సినిమా గురించి ఆసక్తి నెలకొంది.

Posani Murali Krishna Doing Another Movie In His Direction-Political Posani Next Which Party Ycp Ys Jagan

Posani Murali Krishna Doing Another Movie In His Direction

గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్‌ దుర్యోదన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా విమర్శకులకు పని చెప్పింది. పలు వివాదాలను మూట కట్టుకున్న ఆ చిత్రం విభిన్నంగా ఉందని మాత్రం ప్రేక్షకులు ఒప్పుకున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి తరం ప్రేక్షకులు మొత్తం మారిపోయారు. ప్రస్తుతం ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి. కాని పోసాని త్వరలో ఆపరేషన్‌ దుర్యోదన టైప్‌లోనే ఒక చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడు.

Posani Murali Krishna Doing Another Movie In His Direction-Political Posani Next Which Party Ycp Ys Jagan

ఏపీ మరియు తెలంగాణ రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుని కరెక్ట్‌గా ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరుగబోతున్న సమయంలో విడుదల చేయబోతున్నాడట. మేలో తన రాజకీయ డ్రామా చిత్రాన్ని విడుదల చేస్తానంటూ పోసాని చెప్పుకొచ్చాడు. పోసాని రూపొందించబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. పైగా బాబోయ్‌ పోసాని మూవీ వద్దుర అంటున్నారు. పోసాని మూవీ పాత చింతకాయ పచ్చడి లా ఉంటుందని, దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు అంటూ కొందరు అప్పుడే కామెంట్స్‌ చేస్తున్నారు.