ఆపరేషన్‌ వికటించడంతో మళ్లీ పోసానికి ఆపరేషన్‌, పరిస్థితి సీరియస్‌  

Posani Krishna Murali Join In Hospital-join In Hospital,posani Krishna Murali,ysrcp

విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న పోసాని కృష్ణ మురళి మొన్నటి ఎన్నికల సమయంలో వైకాపా తరపున గడప గడప తిరిగి ప్రచారం చేసిన విషయం తెల్సిందే. జగన్‌ను సీఎంగా చూడాలని చాలా ఆశ పడ్డ పోసాని ఆశ నెరవేరింది. జగన్‌ సీఎం అయిన తర్వాత అంతా బాగుందనుకుంటున్న సమయంలో పోసాని అనారోగ్య సమస్యత హాస్పిటల్‌లో జాయిన్‌ అవ్వడం హెర్నియా ఆపరేషన్‌ చేయించుకోవడం జరిగింది.

ఆపరేషన్‌ వికటించడంతో మళ్లీ పోసానికి ఆపరేషన్‌, పరిస్థితి సీరియస్‌-Posani Krishna Murali Join In Hospital

హెర్నియా ఆపరేషన్‌ తర్వాత కొన్ని రోజులకు ఇంటికి వెళ్లి పోయిన పోసాని కృష్ణ మురళి తాజాగా మళ్లీ అదే హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాడు. ఇటీవల చేసిన ఆపరేషన్‌ సక్సెస్‌ అవ్వలేదని, దాంతో ఆపరేషన్‌ జరిగిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగా మళ్లీ ఆపరేషన్‌ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ పోసానిని డిచార్జ్‌ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఆయన సినిమాలు ఏమీ చేయడం లేదు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దాంతో పాటు ఈయన వైకాపాకు మద్దతుగా నిలిచిన కారణంగా కొందరు ఈయన్ను కావాలని తమ సినిమాల నుండి తీసేశారట. ఆమద్య బన్నీ పేరు కూడా వినిపించింది.

బన్నీ తన సినిమా నుండి పోసానిని తీసేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని పోసాని చెప్పుకొచ్చాడు. అయితే ఒక సినిమా నుండి అశ్వినీదత్‌ మాత్రం తనను తొలగించాడని పోసాని అన్నాడు.