పవన్ ని పోసానీ తిట్టిపోసాడు ! జగన్ మెచ్చుకుంటారా ? 

గత కొద్ది రోజులుగా వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ముఖ్యంగా సినిమా టికెట్లను ఆన్లైన్ చేయడం ప్రభుత్వమే టికెట్లను అమ్మాలి అని నిర్ణయించుకోవడం వంటివి తనను టార్గెట్ చేసుకునే చేస్తున్నారు అనే అనుమానం పవన్ లో కలిగింది.

 Jagan, Ysrcp, Ap, Tdp, Chandrababu, Pavan Kalyan, Janasenani, Janasena,posani Kr-TeluguStop.com

ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మంత్రులు పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే,  పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని , ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతమని ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్స్ కూడా ప్రకటన చేసింది.దీంతో పవన్ కు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ కూడా లేదు అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.

తాజాగా సినీ నటుడు , మాటల రచయిత పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మీడియా సమావేశం నిర్వహించిన పోసాని ” పవన్ కళ్యాణ్ కు అసలు విలువలే లేవు.

అసలు హీరో కి ఉండాల్సిన లక్షణాలు లేవు.ఎవరి మాటా వినడు.

పవన్ కళ్యాణ్ కి తనను తాను ప్రేమించుకోవడం మాత్రమే వచ్చు.ఒక సినిమా వేడుకలో రాజకీయాలు మాట్లాడకూడదని కనీస ఇంగితం లేదు పవన్ కళ్యాణ్ కి.  జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కి లేదు.పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హీరో.

కానీ పవన్ లూజ్ టంగ్ వల్ల మంత్రులతో తిట్లు తింటున్నారు.పవన్ కళ్యాణ్ అంత స్థాయి ఉన్న హీరో ని ఒక మంత్రి ఎందుకు తిడతాడు ? పవన్ కళ్యాణ్ కి సిగ్గు అనిపించడం లేదా ? ఎందుకు అంత లూజ్ టంగ్.పవన్ కళ్యాణ్ కి నిజాయితీ ఉందా ? పవన్ రెమ్యునరేషన్ విషయంలో అబద్ధం ఆడారు.

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Posanikrishna, Ys

10 కోట్లు అన్నారు.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ యాభై కోట్లు.కాదని నిరూపించమనండి.

పెద్ద హీరో అంటే పెద్ద మనసు ఉండాలి.హీరోలు అంటే ఎన్టీఆర్ , ఏ ఎన్నార్.

వారి నటనలో పది శాతం కూడా పవన్ కి రాదు.వాళ్ళు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ లా నిర్మాతలు, డిస్టి బ్యూటర్ వ్యవహారాల్లో తల దూర్చలేదు.

సినిమాలు హిట్ అయితే అడ్డగోలుగా డబ్బులు పెంచుకోలేదు.పవన్ కళ్యాణ్ ఒక్క విషయంపై కూడా సరిగ్గా నిలబడలేదు.అసలు పవన్ కళ్యాణ్ కి ప్రశ్నించడమే రాదు.” అంటూ విమర్శలు చేశారు.పోసాని మినహా సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన వారు ఎవరూ ఇప్పటి వరకు పవన్ విషయంలో ఈ రేంజ్ లో జోక్యం చేసుకోలేదు.కానీ పోసాని ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

మొదటి నుంచి జగన్ పార్టీ తరపున మంచి వాయిస్ వినిపించే వారు పోసాని.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోసానికి మంచి ప్రాధాన్యం ఉన్న పదవి దక్కుతుంది అని అంతా అనుకున్నా, జగన్ ఈయనకు పదవి ఇచ్చే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు.

జగన్ కు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ వస్తున్న పవన్ ను ఈ రేంజ్ లో పోసాని ఇప్పుడు అడేసుకోడం తో పోసాని కష్టాన్ని జగన్ గుర్తిస్తారా లేదా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube