ఇకపై ఎప్పుడు జగన్‌కు ఓటేయమని అడగను : పోసాని  

Posani Krishna Murali Comments On Jagan Mohan Reddy-

సినీ నటుడు, దర్శక, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాల్సిందిగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వాలని గట్టిగా ప్రయత్నించిన పోసాని కోరిక తీరింది.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో మాట్లాడి మరోసారి ఆకట్టుకున్నాడు...

Posani Krishna Murali Comments On Jagan Mohan Reddy--Posani Krishna Murali Comments On Jagan Mohan Reddy-

నేను ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి బాగానే డబ్బు సంపాదించుకున్నాను, నాకు దేవుడు మంచి భార్యను, పిల్లలను ఇచ్చాడు.ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క కోరిక జగన్‌ సీఎం అవ్వడం.

నిన్న జగన్‌కు ఏపీ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి సీఎం చేశారు.

Posani Krishna Murali Comments On Jagan Mohan Reddy--Posani Krishna Murali Comments On Jagan Mohan Reddy-

దాంతో దేవుడు నా ఆ ఒక్క కోరికను కూడా నెరవేర్చాడు.ఇకపై నాకు జీవితంలో ఎలాంటి కోరికలు లేవు.జగన్‌ను సీఎంగా చూడాలనుకున్న కోరిక నెరవేరడంతో చాలా సంతోషంగా ఉన్నానంటూ పోసాని చెప్పుకొచ్చాడు.

మొన్నటి వరకు నేను జగన్‌కు ఓటు వేయమని చాలామందిని కోరాను.ఇకపై ఎప్పుడు కూడా జగన్‌కు ఓటు వేయమని కోరను అంటూ పోసాని చెప్పుకొచ్చాడు.

జగన్‌కు మళ్లీ ఎప్పుడు కూడా నా అవసరం రాదు.ఎందుకంటే జగన్‌ ఒకసారి సీఎం అయిన తర్వాత ఆయన్ను ప్రజలు పూర్తిగా నమ్ముతారు.

ఆయన పాలనను చూసి మళ్లీ మళ్లీ జగన్‌ సీఎం అవ్వాలని కోరుకుంటారు.తర్వాత ఎన్నికల్లో నేను జగన్‌కు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా, ఆయనకు నేను ఓటు వేయమని ప్రజలను అడగకున్నా ఆయన గెలిచేస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు.ఇకపై వరుసగా జగన్‌ సీఎం అవుతాడు అంటూ పోసాని చెప్పుకొచ్చాడు...