ఏ గుర్తు ఎక్కడ ఉందో... చెప్పండి రాజా !     2018-12-07   10:26:06  IST  Sai M

ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. సనత్ నగర్ పరిధిలో ఓటు వేసేందుకు వచ్చిన పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్లారెడ్డిగూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Posani Krishanmurali Coments On Telangana Elections-

మొదట పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఓటు వేసేందుకు ఇబందిపడ్డారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయట మాట్లాడుతూ… ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు ఇబ్బంది పడతారని పోసాని అన్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.