బతుకు జట్కాబండి కూడా డ్రామానే అంటున్న పోసాని  

Posani Comments On Bathuku Jatka Bandi - Telugu Bathuku Jatka Bandi, Posani, Posani Krishna Murali Comments On Bathuku Jatka Bandi, Zee Telugu

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ప్రసారం అయ్యే బతుకు జట్కాబండి కార్యక్రమం గురించి పోసాని కృష్ణ మురళి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు.ఆ కార్యక్రమానికి వచ్చే వారితో గొడవ పడాల్సిందిగా ముందుగానే చెప్పడంతో పాటు కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం ఇంకా ఏడ్వడం వంటివి ముందే చెప్పి చేయిస్తారు అంటూ పోసాని కామెంట్స్‌ చేశాడు.

 Posani Comments On Bathuku Jatka Bandi

ఆ కార్యక్రమం మొత్తం స్క్రిప్ట్‌ ప్రకారం జరుగుతుందని మొదటి నుండే పుకార్లు ఉన్నాయి.తాజాగా పోసాని వ్యాఖ్యలతో ఆ పుకార్లు నిజమే అని తేలిపోయింది.

గతంలో పోసాని ఆ క్యాక్రమంలో పాల్గొన్నాడు.ఏడాది పాటు పోసాని ఆ షోకు పని చేశాడు.ఆ సమయంలో తనతో చాలా స్క్రిప్ట్‌ పనులు చేయించాలని చూశారు.కాని నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

బతుకు జట్కాబండి కూడా డ్రామానే అంటున్న పోసాని-Movie-Telugu Tollywood Photo Image

నాకు నమ్మకం అనుకున్న వైపు ఉంటాను.వారు చెప్పిన వైపు ఉండేందుకు నేను ఎప్పుడు ఒప్పుకోలేదు.

ఒకరిని తిట్టమంటూ నన్ను అడిగితే నేను తిట్టను అన్నాను.నాకు అవతలి వారి గురించి పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే నేను వారి విషయంలో జోక్యం చేసుకుంటాను.

కార్యక్రమంలోకి వచ్చే వారు కొందరు ఫేక్‌గా అనిపించే వారు.వారి విషయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం అయ్యేది కాదు.నిర్వాహకులు ఏదో ఒకటి చెప్పమంటే నేను ఒప్పుకునేవాడిని కాదంటూ పోసాని చెప్పుకు వచ్చాడు.రోజా మాత్రం పక్కాగా కార్యక్రమాన్ని నడిపిస్తుంది.అంటే ఆమె స్క్రిప్ట్‌ ప్రకారం నడుచుకుంటూ ఉంటుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.రోజా ఆ డ్రామాను బాగానే రక్తి కట్టిస్తున్నారు కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test