విదేశాల్లో పుష్ప మ్యానియా.. శ్రీవల్లి పాటకు తండ్రికూతురు చేసిన డ్యాన్స్ చూస్తే..

పుష్ప మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు కాసుల పంట పండించింది.

 Portuguese Father And Daughter shakes Leg For Pushpa Srivalli Song Viral On Soc-TeluguStop.com

ఈ సినిమాతో బన్నీ రేంజ్ కూడా మారిపోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.

ఇక ఈ మధ్యనే ఓటిటి లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు గడుస్తున్న పుష్ప మానియా ఇంకా తగ్గడం లేదు.ముఖ్యంగా విదేశాల్లో పుష్ప మ్యానియా విపరీతంగా పెరిగి పోతుంది.ఈ సినిమా హిట్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం మ్యూజిక్.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి పాట క్రేజ్ రోజురోజుకూ పెరిగి పోతుంది.

గత కొన్ని రోజుల నుండి పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఈ పాటకు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.సెలెబ్రిటీలు మాత్రమే కాదు మాములు ప్రేక్షకులు సైతం ఈ పాటని వదిలి పెట్టడం లేదు.

తాజాగా శ్రీవల్లి సాంగ్ ను పోర్చుగీస్ కు చెందిన తండ్రి కూతురు కలిసి చేసారు.వీరు చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.తండ్రి తో పాటు తన చిన్నారి ప్రిన్సెస్ కూడా చేసిన శ్రీవల్లి పాటకు నెటిజెన్స్ నుండి మంచి స్పందన వస్తుంది.ఇప్పటికే ఈ వీడియోను 4 మిలియన్ల మంది వీక్షించారు.

అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేసి ఈ తండ్రి కూతురు వావ్ అనిపించారు.ఆ వీడియో మీకోసం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube