వైరల్.. కుండను ఉపయోగించి 25 కిలోల లాలీపప్ ను తయారు చేసాడు.. !

లాలీపప్ గురించి తెలియని పిల్లలు ఉండరేమో.అంత ఇష్టం వారికీ లాలీపప్ అంటే.

 Popular Youtube Cooking Channel Makes 25-kg Lollipop From Scratch,  Village Food-TeluguStop.com

పెద్దవారు కూడా పిల్లలు కొద్దిగా మారం చేసిన లాలీపప్ చూపిస్తారు.ఎందుకంటే లాలీపప్ ను చుస్తే దెబ్బకు ఏడుపు ఆపేస్తారు.

అయితే లాలీపప్ ఏ సైజులో ఉంటుందో మనందరికీ తెలుసు.మహా అయితే మన అరచేయి సైజు వరకు ఉంటుంది.కానీ మీరు ఎప్పుడైనా 25 కేజీల లాలీపప్ చూసారా.

25 కేజీల లాలీపప్పా అని ఆశ్చర్య పోతున్నారా ఇంత పెద్దది చేయడం ఎలా సాధ్యం అని కూడా మీరు అనుకుంటున్నారు కదా అయితే ఇక్కడ ఉన్న వీడియో పై ఒక లుక్ వేయండి.ఈ వీడియోలో ఒక వ్యక్తి 25 కేజీల లాలీపప్ తయారు చేసాడు.తన యూట్యూబ్ ఛానెల్ లో 25 కేజీల లాలీపప్ తయారు చేసి రెసిపీ పోస్ట్ చేసాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంత పెద్ద లాలీపప్ ఎలా తయారు చేసాడో మీకు తెలుసా అందుకు ఆ వ్యక్తి పెద్ద శ్రమ కూడా పడలేదు.ఒక మట్టి కుండను ఉపయోగించి ఆ పెద్ద లాలీపప్ ను తయారు చేసాడు.యూట్యూబ్ లో విలేజ్ ఫుడ్ ఛానెల్నడుపుతున్న ఫిరోజ్ చుట్టిపారా అనే వ్యక్తి ఇంత పెద్ద లాలీపప్ ను తయారు చేసి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇంత పెద్ద లాలీపప్ నుతయారు చేయడం కోసం సింపుల్ గా మట్టి కుండను ఉపయోగించాడు.లాలీపప్ మిశ్రమాన్ని కుండలో పోసి అందులో మధ్యలో ప్లాస్టిక్ పైపును ఉంచి 12 గంటల తర్వాత ఆ కుండను పగల గొట్టి ఆ లాలీపప్ ను బయటకు తీసాడు.ఈ రంగురంగుల లాలీపప్ చూడడానికే కాదు తినడానికి కూడా బాగుంటుందని అతడు తెలిపాడు.

మీరు కూడా ఆ లాలీపప్ ఎలా తయారు చేసాడో ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube