పాపులర్ యూట్యూబ్ నటికి డ్రైవర్ వేధింపులు.. చివరకు..?

ఈ మధ్య కాలంలో యువతులు, మహిళలపై వేధింపుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తాజాగా ఒక యూట్యూబ్ నటి డ్రైవర్ తనను వేధింపులకు గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Popular Youtube Actress Facing Harrassment, Banjara Hills Police Station, Facing-TeluguStop.com

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మేరకు కేసు నమోదైంది.యూట్యూబ్ నటి నేహాశర్మ తాను నియమించుకున్న డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో నేహాశర్మ యాంకర్ గా, నటిగా పని చేస్తున్నారు.ఆమె దగ్గర పని చేసే డ్రైవర్ షేక్ ఇబ్రహీం డ్రగ్స్ కు బానిసై నటిని డబ్బు కోసం వేధిస్తున్నాడు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన నేహాశర్మ దగ్గర షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు.జనవరి 13వ తేదీన నేహాశర్మ షూటింగ్ నిమిత్తం డ్రైవర్ తో కలిసి కేరళకు వెళ్లింది.

Telugu Banjara Hills, Neha Sharma, Shaik Ibrahim, Youtube Actress-Movie

ఆ సమయంలో డ్రగ్స్ కు బానిసైన షేక్ ఇబ్రహీం నటి నేహాశర్మను వేధింపులకు గురి చేశాడు.ఆ తరువాత ఆమె నగరానికి చేరుకోగా మూడు రోజుల క్రితం షేక్ ఇబ్రహీం నటి బంగారం గొలుసును తీసుకున్నాడు.బంగారం గొలుసును ఇబ్రహీం లాక్కునే సమయంలో నటి, షేక్ ఇబ్రహీం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఆ తరువాత గొలుసు ఇచ్చేసి షేక్ ఇబ్రహీం అక్కడినుంచి వెళ్లిపోయాడు.

డ్రైవర్ మానసికంగా వేధింపులకు గురి చేయడంతో నటి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ 354 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను అమలు చేస్తున్నా దేశంలోని మహిళలపై వేధింపుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube