హైదరాబాద్ పబ్ లో సిద్ శ్రీరామ్ కి అవమానం

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న గాయకుడు సిద్ శ్రీరామ్.మలయాళీ సింగర్ అయిన సిద్ శ్రీరామ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతాగోవిందం సినిమాలో సాంగ్ తో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

 Popular Singer Sid Sriram Insulted At A Famous Club-TeluguStop.com

ఆ సినిమాలో సిద్ పాడిన పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడమే కాకుండా సినిమా మీద హైప్ పెరగడానికి కూడా కారణం అయ్యింది.ఆ తరువాత కూడా సిద్ శ్రీరామ్ పాడిన పాటలు కొన్ని సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాయి.

ఇక ఈ సెంటిమెంట్ భాగా వర్క్ అవుట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ అతని వెంట పడుతున్నారు.సిద్ శ్రీరామ్ పాట పాడితే సినిమా గ్యారెంటీ హిట్ అనేబలమైన నమ్మకం దర్శకులకి కలగడంతో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆయనతో సాంగ్స్ పాడించుకుంటున్నారు.

 Popular Singer Sid Sriram Insulted At A Famous Club-హైదరాబాద్ పబ్ లో సిద్ శ్రీరామ్ కి అవమానం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన నుంచి వస్తున్న పాటలు కూడా సోషల్ మీడియాలో అలాగే వేవ్ క్రియేట్ చేస్తున్నాయి.సిద్ శ్రీరామ్ పాట అంటే ఎగబడి మరీ సోషల్ మీడియాలో అతని గొంతుకకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఓపెన్ చేసి చూడటమే కాకుండా విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అయితే గొంతుక ఎంత భాగున్నా అన్ని పాటలని ఒకే మాదిరిగా పాడుతాడనే విమర్శలు కూడా అతని మీద ఉన్నాయి.అలాగే పాటలలో అతని తెలుగు వాచకం కూడా చాలా తప్పుగా ఉంటుందని, పూర్తిగా అర్ధాలు మారిపోతూ ఉంటాయని సాహితీప్రియులు విమర్శిస్తూ ఉంటారు.

ఏది ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో అతని ట్రెండ్ నడుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఓ పబ్ లో సిద్ శ్రీరామ్ కి ఘోర అవమానం జరిగింది.

ఓ ఈవెంట్ కి హాజరైన సిద్ పై పబ్ లో కొంత మంది ఆకతాయిలు తాగిన మత్తులో నీళ్ళు, మద్యం విసిరారు.అకాయితాయిలను‌ గెట్ అవుట్ అంటూ సిద్ శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు.

వెంటనే అక్కడున్న పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవను ఆపేసారని తెలుస్తుంది.ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

#Hyderabad #Night Pub #SouthIndia #Famous Club #PopularSinger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు