ఆమె ఒక పాపులర్ సీరియల్ నటి..కానీ రోడ్డు ప్రక్కన 'దోసలు' వేస్తుంది..! కారణం తెలుస్తే కన్నీళ్లే.!  

  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని సినిమావాళ్లు చాలా చక్కగా వంటపట్టించుకుంటారు.ఎందుకంటే ఇవాళ ఉన్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో అనే భయంతోఅలాంటి ఆలోచన లేకుండా దొరికిన పాత్రలు చేస్తూ పోతూ ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోని కవితా లక్ష్మి ఇప్పుడు దోసెలు అమ్ముకుంటుంది.అది కూడా కొడుకు ఆనంద్ క్రిష్ణ ని బ్రిటన్ లో చదివించడానికి…

  • Popular Serial Artist Kavitha Lakshmi Becomes A Street Vender-Kavitha Vender Serial Unknown Facts About Viral

    Popular Serial Artist Kavitha Lakshmi Becomes A Street Vender

  • ఇంతకీ ఈ కవిత ఎవరూ అనే కదా మీ డౌట్మళయాళంలో ఫేమస్ సీరియల్ ఆర్టిస్టు ఈ కవిత.స్త్రీధనం అనే సీరియల్లో నెగటివ్ రోల్ పోషిస్తున్న ఈమె నటనకు మళయాలం చాలా మంది అభిమానులున్నారు.ఇప్పుడు ఈమె చేస్తున్న పని ద్వారా దేశమంతా అభిమానులు తయారవుతున్నారు. ఎందుకంటే ఆత్మాభిమానాన్ని నమ్ముకుని నామోషి లేకుండా కష్టపడి జీవించే వారిని అభిమానించకుండా ఎలా ఉండగలరు.

  • Popular Serial Artist Kavitha Lakshmi Becomes A Street Vender-Kavitha Vender Serial Unknown Facts About Viral
  • అందుకే ఈమె కష్టాన్ని అర్దం చేసుకుని దర్శకులు కూడా మార్నింగ్ టు ఇవెనింగ్ షూట్స్ పెట్టుకుంటున్నారు.షూటింగ్ అయిపోగానే సరాసరి హైవే పక్కనున్న దోసెల బండి దగ్గరకు వెళ్లి అక్కడ పని చేసుకుంటుంది.కవితాకి కొడుకు తో పాటు కూతురు కూడా ఉంటుంది.కూతురే తల్లికి ఈ పనిలో సాయం చేస్తుంటుంది.

  • ఈమె ఇంత కష్టపడుతుంటే మరి భర్త ఏమయినట్టు అనే కదా మీ అనుమానంపదమూడేండ్ల క్రితమే భర్త నుండి విడాకులు పొందింది.ఇద్దరు పిల్లల బాద్యతను భుజాన వేసుకుంది.వారికోసం పగలు,రాత్రి కష్టపడుతుందిఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్న కవితను ఈ పనెందుకు చేస్తున్నారు అని ఎవరైనా అడిగితేనా పిల్లలకు చేసి పెట్టేది,ఇప్పుడు నా పిల్లల చదువుల కోసం పదిమందికి చేస్తున్నానాకు విలాసవంతమైన జీవితం కన్నా నా పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడ్డం ముఖ్యం.నాకంటూ భూమి,ఇల్లు లేవు అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి,చిట్టి వేస్తున్నా అవి ఇప్పట్లో రావు.అందుకే ఈ మార్గం ఎంచుకున్నాఇదేం తప్పు పని కాదు కదా అని సూటిగా ప్రశ్నిస్తుంది.

  • Popular Serial Artist Kavitha Lakshmi Becomes A Street Vender-Kavitha Vender Serial Unknown Facts About Viral
  • సినిమా తారలే కాని ,టీవి సెలబ్రిటీలే కాని నటన కాకుండా చేసే వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా అంటే టక్కున గుర్తొచ్చేది ఫ్యాషన్ డిజైనింగ్,ఇంటీరియర్ ఇతరత్రాలేదంటే అవసరాల కోసం,సకల సౌకర్యాల కోసం,లగ్జరీ లైఫ్ కోసం అవకాశాలు లేకపోతే వ్యభిచారంలోకి దిగిన వారు కూడా ఉన్నారువారందరికీ భిన్నంగా ఉన్న ఈ కవితాలక్ష్మీ నిజంగా గ్రేట్ కదా.