Veeramachineni Pramod Kumar : టాలీవుడ్ లో మరో విషాదం.. ఆ ప్రముఖ నటుడు మరణించడంతో?

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.వరుసగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యాల కారణంగా మరణిస్తున్నారు.

 Veeramachineni Pramod Kumar : టాలీవుడ్ లో మరో వి-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.ఒక సెలబ్రిటీ మరణం వార్త ఇంకా జీర్ణించుకోకముందే మరొక సెలబ్రిటీ మరణిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna ), కలాతపస్వి కె.విశ్వనాథ్, జమున, వాణీ జయరాం(Kalathapaswi K.Vishwanath, Jamuna, Vani Jayaram) లతో పాటుగా ఇతర సినిమా పరిశ్రమలకు చెందిన మరికొంత మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ మరణించి 24 గంటలు గడవక ముందే, టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు, రచయిత, పబ్లిసిటీ ఇంఛార్జ్ వీరమాచినేని ప్రమోద్ కుమార్( Veeramachineni Pramod Kumar ) అనారోగ్య కారణాలతో తాజాగా మరణించారు.87 సంవత్సరాల ప్రమోద్ కుమార్ 38 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు.ఈ క్రమంలోనే ముఖ్యంగా పబ్లిసిటీ ఇంఛార్జ్ గా దాదాపు 300 చిత్రాలకు పనిచేశారు.ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ జరుపుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి.

నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పారుచుకున్నారు.

అంతే కాకుండా తన సినిమా అనుభవాలను తెర వెనుక తెలుగు సినిమా అనే పేరుతో ఆయన గ్రంథస్తం కూడా చేశారు.కాగా ప్రమోద్ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.అయితే ఇలా వరుసగా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వయసు మీద పడిన సెలబ్రిటీలతో పాటు యంగ్ సెలబ్రిటీలు కూడా మరణిస్తుండటం బాధను కలిగించే విషయం.కొందరు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తుండగా మరికొందరు అనారోగ్యాల కారణంగా మరణిస్తున్నారు.

Veeramachineni Pramod Kumar, Passed Away, Tollywood - Telugu Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube