ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్  

Popular Homemade Fruit Packs For Glowing Skin-

చర్మంలో విషాలను బయటకు పంపి ప్రకాశవంతంగా మార్చటానికి పండ్లసహాయపడతాయి.రసాయనక చికిత్సలు కాకుండా సీజన్ కి తగ్గట్టుగా దొరికే పండ్లతచర్మాన్ని మెరిపించవచ్చు. ఆ పండ్ల గుజ్జులో కొన్ని పదార్దాలను కలిపఉపయోగిస్తే చాలు..

ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్-

అవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఇప్పుడు వాటి గురించతెలుసుకుందాం.1. అరటిపండు – పోషణ :ఇది పొడి చర్మం వారికీ చాలా బాగా సెట్ అవుతుంది. బాగా పండిన అరటిపండునమెత్తగా చేసి, దానిలో పాలు కలిపి మందపాటి పేస్ట్ గా చేయాలి.

దీనిలకొన్ని చుక్కల నిమ్మరసం,అరస్పూన్ కాలామైన్ పౌడర్ కలిపి ముఖానికి రాసఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.2. ఆరెంజ్ – శక్తి :ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే లాభాన్ని చర్మానికి ఇస్తుంది. ఇది చర్మకోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ఒక స్పూన్ తాజా పాల మీగడ,ఒక స్పూన్ ముల్టానా మట్టి వేసి బాగా కలపాలి.

మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాల మీగచర్మంలో పొడిదనంను తగ్గిస్తుంది3. ఆపిల్ – మెరుపు :అలసిన చర్మానికి మెరుపు రావాలంటే ఆపిల్ ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుందిఆపిల్ ని మెత్తని పేస్ట్ గా చేసి దానికి పచ్చి పాలు, పాల పొడి,ముల్టానమట్టి వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక శుభ్రచేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉంచటమకాకుండా సహజ pH సంతులన పునరుద్ధరణకు సహాయపడుతుంది.4. స్ట్రాబెర్రీ – మేజిక్ :స్ట్రాబెర్రీ గుజ్జులో మీగడ వేసి బాగా కలపాలి. దీనికి చైనా పౌడర్ నకలిపి ముఖానికి పలుచగా రాయాలి.

బాగా ఆరిన తర్వాత ముఖాన్ని కడగాలి. ప్యాక్ చర్మాన్ని బిగుతుగా ఉంచటమే కాకుండా, లోపల నుండి పోషణను ఇస్తుంది.5. కొబ్బరి – ట్రిక్ :ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నీరు మచ్చల చికిత్సలో బాగసహాయపడుతుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల కాలామైన్ పొడి, కొబ్బరి నీరుకొన్ని చుక్కల తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరితర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తే మంచి పలితకనపడుతుంది.

కొబ్బరి నీరులో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలచర్మానికి మెరుపు ఇవ్వటంలో సహాయపడుతుంది.