Celebrities Roles: ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్న పాపులర్ సెలబ్రిటీలు వీళ్లే!

కొంతమంది సెలబ్రిటీలు వరుసగా సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటున్నా ఆ సినిమాలలో ఒకే తరహా పాత్రల్లో నటించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తెరపై కొందరు సెలబ్రిటీల పాత్రలు కనిపిస్తే ఆ పాత్ర తీరు ఏంటో ఆ పాత్రకు సంబంధించి ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో కూడా ప్రేక్షకులకు ముందుగానే అర్థమవుతోంది.

 Popular Celebrities Playing Same Roles In Movies Nadiya Srinivas Reddy Rajiv Kan-TeluguStop.com

ప్రముఖ నటి నదియా ఈ మధ్య కాలంలో అమ్మ, అత్త తరహా పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నారు.

అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ తో నదియా పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.

అయితే ఆ తరహా నదియా అమ్మ, అత్త పాత్రలకే పరిమితమయ్యారు.ఈ సీనియర్ హీరోయిన్ ఎక్కువగా పుట్టింటికి దూరంగా ఉండే పాత్రలలో కనిపించి మెప్పించడం గమనార్హం.

మరో స్టార్ యాక్టర్ రాజీవ్ కనకాల ఎక్కువ సినిమాల్లో చనిపోయే పాత్రల్లో కనిపించారు.రాజీవ్ కనకాల సినిమాలో కనిపిస్తే ఆ పాత్ర చనిపోతుందని చాలామంది భావిస్తారు.

అయితే రాజీవ్ కనకాల చనిపోయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Srinivas Reddy, Actress Nadiya, Puri Jagannath, Trivikram, Popular, Raaje

మరో ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి మెజారిటీ సినిమాలలో పీఏ తరహా పాత్రలలో ఎక్కువగా కనిపించారు.అదే సమయంలో దర్శకులకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి.పూరీ జగన్నాథ్ సినిమాలలో ఎక్కువగా హీరో అనాథగా ఉంటారు.

త్రివిక్రమ్ సినిమాలలో ఒక ఇల్లు ప్రధానంగా సినిమాలు తెరకెక్కుతాయి.

Telugu Srinivas Reddy, Actress Nadiya, Puri Jagannath, Trivikram, Popular, Raaje

ఒక భారీ ఇంటి సెట్ వేయించి సినిమాలోని మెజారిటీ సీన్ల షూట్ అక్కడే జరిగేలా త్రివిక్రమ్ చూసుకుంటారు.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాలో ప్రధాన పాత్రలను డీ గ్లామరస్ గా చూపించడానికి ఇష్టపడతారు.కొంతమంది సెలబ్రిటీలు ఒకే తరహా పాత్రల్లో నటిస్తుండటం ఆయా సెలబ్రిటీల అభిమానులకు నచ్చడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube