జూనియర్ ఎన్టీఆర్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. సీఎం అంటూ?

Popular Astrologer Venuswamy Predictions On Junior Ntr Details Here

ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు మారుమ్రోగుతోంది.చైతన్య సమంతల విడాకుల గురించి గతంలో వేణుస్వామి ఏం చెప్పారో అదే విధంగా జరగడంతో చాలామంది వేణుస్వామి చెప్పిన మాటలు నిజమవుతాయని భావిస్తున్నారు.

 Popular Astrologer Venuswamy Predictions On Junior Ntr Details Here-TeluguStop.com

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి వేణుస్వామి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే తిరుగుండదని వేణుస్వామి తెలిపారు.

ఎన్టీఆర్ జాతకం చాలా పవర్ ఫుల్ గా ఉందని వేణుస్వామి తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ నక్షత్రం మఖ నక్షత్రం అని ఎవరైతే మఖ నక్షత్రంలో జన్మిస్తారో వాళ్లకు రాజకీయంగా కలిసొస్తుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

 Popular Astrologer Venuswamy Predictions On Junior Ntr Details Here-జూనియర్ ఎన్టీఆర్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. సీఎం అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నక్షత్రం కూడా మఖ నక్షత్రమని వేణుస్వామి గుర్తు చేశారు.బాలయ్య జాతకంలో సీఎం అయ్యే యోగ్యం లేకపోయినా ఎన్టీఆర్ జాతకంలో మాత్రం ఆ యోగ్యం ఉందని వేణుస్వామి పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 2024 సంవత్సరంలో ఎన్నికలకు వెళితే అనుకూల ఫలితాలు ఉంటాయని అలా జరగకపోతే మాత్రం టీడీపీకి అనుకూల ఫలితాలు రావడం సాధ్యం కాదని వేణుస్వామి వెల్లడించారు

Telugu Ap Cm Jagan, Astrology, Chandra Babu, Ntr, Ntr Astrology, Lokesh, Ntr Politcs, Telugu Desam, Venuswamy-Movie

.రాజకీయంగా తారక్ భవిష్యత్తు అద్భుతంగా ఉందని ప్రస్తుతం తెలుగుదేశంకు ఉన్న ఏకైక గెలుపు మార్గం ఎన్టీఆర్ అని వేణుస్వామి వెల్లడించారు.

Telugu Ap Cm Jagan, Astrology, Chandra Babu, Ntr, Ntr Astrology, Lokesh, Ntr Politcs, Telugu Desam, Venuswamy-Movie

గతంలోనే తాను ఈ విషయాన్ని వెల్లడించానని వేణుస్వామి అన్నారు.చంద్రబాబు, లోకేష్ వల్ల టీడీపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని వేణుస్వామి చెప్పుకొచ్చారు.మరి వేణుస్వామి మాటలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.మరి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నికల్లో  పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు జగన్ 17 సంవత్సరాల పాటు ఏపీకి సీఎంగా ఉంటారని వేణుస్వామి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

#Venuswamy #Astrology #Politcs #NTR #Astrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube