కామెడీ చేయబోతే బ్రహ్మాజీని ఏకంగా తెలంగాణ ద్రోహిని చేసేశారు

హైదరాబాద్ లో తుఫాన్ ప్రభావం ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే.చాలా ఏరియాలు మునిగిపోయి ఇప్పటికి నీటిలోనే ఉన్నాయి.

 Popular Actor Brahmaji Deletes His Twitter Account-TeluguStop.com

కార్లు కొట్టుకుపోయాయి.మనుషులు కూడా కొట్టుకుపోయారు.

ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అంచనా వేయడానికి మరికొంత కాలం పట్టేలా ఉందే.అత్యంత ఖరీదనైనా ప్రాంతాలుగా చెప్పుకునే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి, మణికొండ లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయాయి.

 Popular Actor Brahmaji Deletes His Twitter Account-కామెడీ చేయబోతే బ్రహ్మాజీని ఏకంగా తెలంగాణ ద్రోహిని చేసేశారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బురద నీటిలో ఉన్నాయి.మూడు అడుగుల మేర నీరు వచ్చేసింది.

ఈ స్థాయిలో హైదరాబాద్ లో వరద భీభత్సం సృష్టించడం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.అయితే ఈ విలయతాండవం అంతటికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమని, చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టేయడం వలనే ఇదంతా జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ హైదరాబాద్ వరదల మీద నటుడు బ్రహ్మాజీ కామెడీ చేద్దామని సోషల్ మీడియాలో ఫన్నీగా ట్వీట్ చేశారు.ఆయన మోటార్ బోటు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, దీనికోసం ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని ట్వీట్ చేశాడు.

నిజానికి ఆయన మాటలు హైదరాబాద్ లో పరిస్థితిని అద్దం పెట్టె విధంగా ఉన్నాయి.అయితే ఈ వాఖ్యలు తెలంగాణ వాసులకి అస్సలు రుచించలేదు.బ్రహ్మాజీ వాఖ్యలు కించపరిచే విధంగా ఉన్నాయని అతని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.ఏకంగా తెలంగాణ ద్రోహి అంటూ ముద్ర వేసేశారు.

అయితే ట్రోలింగ్ మొదలైన కొద్ది సేపటికే తన ట్వీట్ తొలగించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సోషల్ మీడియాలో అతని మీద దాడి చేయడం మొదలు పెట్టారు.

దీంతో ఏమీ చేయలేక అకౌంట్ ని డిలేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.వరదల వలన తమ అపార్ట్ మెంట్ లోకి నీళ్లు వచ్చాయని, సెల్లార్ లో కారు పార్కింగ్ చేయడానికి కూడా వీలు లేకపోవడంతో మరో అపార్ట్ మెంట్ కి వెళ్లాల్సి వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కామెంట్స్ చేశానని బ్రహ్మాజీ తెలియజేసిన జరగాల్సిన నష్టం మాత్రం అతనికి జరిగిపోయింది.

#Brahmaji #Tweet #PopularBrahmaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు