కోలుకుంటున్నా, ప్లాస్మా దానంకు నేను రెడీ అంటోంది  

Pop Singer Smitha Tested Negative for covid, Pop Singer Smitha, Corona, Plasma Donation - Telugu Corona, Plasma Donation, Pop Singer Smitha, Pop Singer Smitha Tested Negative For Covid

ప్రముఖ తెలుగు పాప్‌ సింగర్‌, వ్యాపారవేత్త, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే హాయ్‌రబ్బ స్మిత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెల్సిందే.ఆమె కరోనా పాజిటివ్‌ అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు ఇంకా ఆమె వద్ద పని చేసే వారు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు.

 Pop Singer Smitha Ready To Doante Plasma

అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని పూర్తి ఆరోగ్యంగా ఉండటం వల్ల త్వరలోనే కరోనాను జయిస్తారంటూ వైధ్యులు చెబుతున్నారు.
పూర్తిగా స్వీయ నిర్భందంలో ఉంటున్న పాప్‌ సింగర్‌ స్మిత సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా పోస్ట్‌లు చేస్తూనే ఉంది.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ముందుకు వచ్చింది.ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.త్వరలోనే కరోనా పరీక్షలో నెగటివ్‌ వస్తుందని ఎదురు చూస్తున్నాను.నాకు నెగటివ్‌ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను ప్లాస్మా దానం చేస్తాను.

కోలుకుంటున్నా, ప్లాస్మా దానంకు నేను రెడీ అంటోంది-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది చాలా అవసరం అంటూ ఆమె పేర్కొంది.
ప్లాస్మా దానం విషయంలో టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఎంతో మంది ప్రముఖంగా ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అయినా కూడా చాలా మంది ఇంకా ప్లాస్మా దానం అంటే ఏదో ప్రమాదం అన్నట్లుగా భయపడి పోతున్నారు.ప్లాస్మా దానం చేయడం వల్ల ఎలాంటి ఆందోళనకర విషయం జరగదు అంటూ స్మిత కూడా ప్రచారం చేసేందుకు తాను ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించింది.

ఈమద్య కాలంలో సెలబ్రెటీల ప్రచారం కారణంగా కాస్త జనాలు ముందుకు వచ్చి ప్లాస్మా ఇచ్చి కరోనా రోగులను కాపాడుతున్నారు.

#Plasma Donation #Corona #PopSinger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pop Singer Smitha Ready To Doante Plasma Related Telugu News,Photos/Pics,Images..