పూర్ణ కూడా అలాంటి పాత్రకు షిఫ్ట్ అవుతోందిగా!  

Poorna To Do Negative Role In Raj Tharun Movie, Poorna, Negative Role, Avunu, Raj Tharun, Tollywood News - Telugu Avunu, Negative Role, Poorna, Raj Tharun, Tollywood News

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్నప్పుడే తమ స్టార్‌డమ్‌ను రెట్టింపు చేసుకుంటారు హీరోయిన్లు.ఇక ఈ కోవలో వారు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తుంటారు.

TeluguStop.com - Poorna To Do Negative Role In Raj Tharun Movie

కాగా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొంతమందికి అదృష్టం కలిసి రాకపోవడంతో వారు ఎన్ని పాత్రలు చేసినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.ఇలాంటి వారిలో అందాల భామ పూర్ణ కూడా ఒకరు.

శ్రీమహాలక్ష్మీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, సీమ టపాకాయ్‌తో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది.
ఇక రవిబాబు తెరకెక్కించిన అవును సిరీస్ చిత్రంలో నటించిన పూర్ణ, తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

TeluguStop.com - పూర్ణ కూడా అలాంటి పాత్రకు షిఫ్ట్ అవుతోందిగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా కమర్షియల్ సక్సెస్ అమ్మడికి రాలేదు.దీంతో హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన ఈ బ్యూటీ, ప్రస్తుతం డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

అయితే తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించనున్న ఓ సినిమాలో పూర్ణ నెగెటివ్ రోల్‌లో నటించేందుకు సిద్ధమయ్యింది.ఇప్పటివరకు నెగెటివ్ పాత్రలో కనిపించని పూర్ణ, ఈ సినిమాతో తనలోని విలన్‌ను బయటపెట్టేందుకు రెడీ అయ్యింది.

విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో రాబోయే ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాతో రాజ్ తరుణ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

కాగా ఈ సినిమాతో తనకు మళ్లీ మంచి బ్రేక్ వస్తుందని పూర్ణ ఆశిస్తుంది.ఈ సినిమాలో తన పాత్ర కోసం పూర్ణ తన ఇమేజ్‌ను కొంతమేర మేకోవర్ చేయనుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Poorna #Negative Role #Avunu #Raj Tharun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poorna To Do Negative Role In Raj Tharun Movie Related Telugu News,Photos/Pics,Images..