పెళ్లి చేసుకోనంటున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?  

Poorna Says Will Not Marry Anyone, Poorna, Actress Poorna, Marriage, Tollywood News - Telugu Actress Poorna, Marriage, Poorna, Tollywood News

టాలీవుడ్‌లో అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్‌లుగా మారితే, చాలా మంది మీడియం, చిన్న రేంజ్ హీరోయిన్లుగా మిగిలిపోయారు.

 Poorna Says Will Not Marry Anyone

ఇలాంటి కోవలోకే వస్తుంది నటి పూర్ణ.టాలీవుడ్‌లో ‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.

అయితే పెద్ద సినిమా ఏదీ అమ్మడికి పడకపోవడంతో కేవలం మీడియం రేంజ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది.

పెళ్లి చేసుకోనంటున్న హీరోయిన్.. ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా కన్నడ, తమిళం, మలయాళంలో మంచి అవకాశాలు దక్కించుకుంది.

ఇక బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ, ఇటీవల వార్తల్లో నిలిచింది.కొందరు యువకులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఓ ముఠాగా ఏర్పడిన వారు పూర్ణను పెళ్లి పేరుతో మోసం చేయాలని చూసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనతో ఆమెకు పెళ్లిపై ఆసక్తి పోయిందని, తాను జీవితంలో పెళ్లి చేసుకోబోనని తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇలా ఓ హీరోయిన్ పెళ్లికి ససేమిరా అంటుండటంతో ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ చిన్నది పెళ్లికి నో చెబుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నారట.

ఏదేమైనా ఇలా ఓ హీరోయిన్‌ను వేధించిన ఆ ముఠాను పోలీసులు కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

#Poorna #Marriage #Actress Poorna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poorna Says Will Not Marry Anyone Related Telugu News,Photos/Pics,Images..