9వ నెలలోకి అడుగుపెట్టిన పూర్ణ.. కుటుంబ సభ్యులు చేసిన పనికి సంతోషంలో నటి!

సినీనటి పూర్ణ(Poorna) ప్రస్తుతం గర్భిణి అనే విషయం మనకు తెలిసిందే.ఈమె గత ఏడాది జూన్ నెలలో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు ఇలా పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఈమె ప్రెగ్నెన్సీ అనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

 Poorna, Who Has Entered Her 9th Month, Is Happy With The Work Done By Her Famil-TeluguStop.com

ఇలా ఈమె ప్రెగ్నెంట్( Pregnant ) కావడంతో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తరచూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అదేవిధంగా తన సీమంతపు వేడుకలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ విధంగా పూర్ణ ప్రస్తుతం 9వ నెలలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు(Family Members) తనకు ఇష్టమైనటువంటి తొమ్మిది రకాల వంటకాలను తయారుచేసి తనకు సర్ప్రైజ్ చేశారట.ఇలా ఈ వంటకాలను తన భర్త తనకు ప్రేమగా తినిపిస్తున్నటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కుటుంబ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు తనకు ఇష్టమైన వంటకాలను తయారు చేయడంతో పూర్ణ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె 9వ నెలలోకి అడుగుపెట్టడంతో మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ముందుగానే పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక పూర్ణ తెలుగులోకి సీతామహాలక్ష్మి సినిమా ద్వారా అడుగుపెట్టి అనంతరం పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

అయితే ఈమె ప్రస్తుతం వెండితెర పై హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటిస్తూ వచ్చారు.మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈమె సందడి చేసేవారు.

ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పూర్ణ బుల్లితెర వెండితెరక కూడా దూరమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube