నేనేం పెద్ద హీరోయిన్ ని కాదు.. నయనతార వల్లే ఇలా: పూర్ణ

అల్లరి నరేష్ హీరోగా సీమటపాకాయ్ సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసిన హీరోయిన్ పూర్ణ ఆ తర్వాత పలు సినిమాల ద్వారా సందడి చేశారు.ప్రస్తుతం వెండితెరపై ఈమెకు అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Poorna About Nayanthara At Sundari Promotions-TeluguStop.com

ఈ మధ్య కాలంలో పూర్ణ కాస్త ఓవరాక్షన్ చేయడంతో నెటిజన్లు ఈమె పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా పూర్ణ హీరోయిన్ గా కల్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో నిర్మాత రిజ్వాన్ “సుందరి” అనే సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా ద్వారా అగ్నిసాక్షి సీరియల్ నటుడు అంబటి అర్జున్ వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13 న విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Poorna About Nayanthara At Sundari Promotions-నేనేం పెద్ద హీరోయిన్ ని కాదు.. నయనతార వల్లే ఇలా: పూర్ణ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నటి పూర్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ… ఈ కథకు పెద్ద హీరోయిన్ ను తీసుకోవచ్చు.

కానీ రిజ్వాన్ నాపై నమ్మకం ఉంచి నన్ను తీసుకున్నారు.ఈ కథను చేసేంత పెద్ద హీరోయిన్ నేను కాదంటూ పూర్ణ తెలియజేశారు.

Telugu Agnisakshi Serial, Ambati Arjun, Heroine Poorna, Inspiration, Nayanthara, Poorna Latest Movie, Sundari, Sundari Movie Promotions-Movie

ఇలాంటి కథను ఎంచుకోవడానికి కారణం నయనతార.నయనతార ఇన్స్పిరేషన్ వల్లనే ఇలాంటి సినిమా చేయగలమని నమ్మకం నాకు కలిగింది.అందుకే ఈ చిత్రంలో నేను నటించాను.మా సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించండి అంటూ ఈ సందర్భంగా పూర్ణ తెలియజేశారు.

#Poorna #Nayanthara #Ambati Arjun #Poorna #Sundari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు