కొడుకు పొతే దినం భోజనాలు పెట్టలేదని ఏకంగా ఊరి నుంచి  

Poor Man\'s Family Ostracised For Not Giving Lavish Feast-mungeli Distict,one Wife Five Childrens,poor Man\\'s Family,santhan Nirmalkar

మూర్ఖత్వం తో జనాలు ఎలా ప్రవర్తిస్తారో తెలియను కూడా తెలియదు.కేవలం కొడుకు చనిపోతే దినం భోజనాలు పెట్టలేదన్న కక్ష తో గ్రామస్తులు అందరూ ఏకం అయ్యి ఆ కుటుంబాన్ని వెలివేశారు.

Poor Man\'s Family Ostracised For Not Giving Lavish Feast-mungeli Distict,one Wife Five Childrens,poor Man\'s Family,santhan Nirmalkar Telugu Viral News-Poor Man's Family Ostracised For Not Giving Lavish Feast-Mungeli Distict One Wife Five Childrens Poor Man\'s Santhan Nirmalkar

ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని ముంగేళీ జిల్లాలో చోటుచేసుకుంది.ఆ జిల్లా లోని సంతన్ నిర్మాల్కర్ అనే వ్యక్తికి భార్య,ఐదుగురు పిల్లలు.

అయితే వారిలో 20 ఏళ్ల కుమారుడు 2016 లో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తో ఆకుటుంబం బాధలో మునిగిపోయింది.అయితే అలాంటి సమయంలో వారికి అదరణగా నిలవాల్సిన గ్రామం కేవలం దినం భోజనాలు పెట్టలేదని సాకుగా చూపుతూ ఆ కుటుంబాన్ని వెలివేసింది.ఒకటి కాదు,రెండు కాదు,ఏకంగా మూడు సంవత్సరాలు గా ఆ కుటుంబం ఆ ఊరి తో సంబంధం లేకుండా జీవిస్తుంది.

వారిని వెలివేయడం తో వారితో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు.ఎవరూ పని కూడా ఇవ్వడం సంతన్ అతడి కుటుంసభ్యులు మూడేళ్ల నుంచి వారు గ్రామానికి బయటే ఉంటున్నారు.

ఊళ్లో ఎవరూ వారితో మాట్లాడడం లేదు.ఎవరూ పని కూడా ఇవ్వడం లేదు.

కూరగాయలు అమ్మేవారిని కూడా వారికి సరుకులు అమ్మితే వెలివేస్తామని బెదిరించడం తో అవి కూడా లభించడం లేదు.మూడేళ్ల నుంచి వేరే గ్రామం మీద ఆధారపడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో విసిగిపోయిన ఆ బాధిత కుటుంబం చివరకు గ్రామస్తుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈ ఒక్క సంతన్ మాత్రమే కాదని చాలా మంది ఇలాంటి వెలివేతకు గురవుతున్నారు అని పలువురు విశ్లేషకులు అంటున్నారు.