పేద పిల్లల ఆకలి తీర్చిన నాట్స్.  

Poor Children Was Served By Nats-nats,north America,serving Poor,telugu Nri Updates

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో నాట్స్ కూడా ఒకటి. భాషే రమ్యం సేవే గమ్యం అంటూ స్లోగన్ తో ప్రజలకి సేవచేయాలని భావించే నాట్స్ అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. ఉమెన్స్ దే సందర్భంగా నాట్స్ పేద పిల్లల ఆకలి తీర్చడానికి ఓ బృహత్తర కార్యం ఏర్పాటు చేసింది..

పేద పిల్లల ఆకలి తీర్చిన నాట్స్.-Poor Children Was Served By Nats

పేద పిల్లల ఆకలి తీర్చడానికి నాట్స్ ఏకంగా 62 వేల మంది పేద పిల్లలకి ఆకలి తీర్చేలా భోజనాలు ఏర్పాటు చేసింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి,సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర, రోజా శీలంశెట్టి,కల్పన సుంకర,రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఈ ఏర్పాట్లని పరిశీలించారు.

అంతేకాదు తమకి తెలిసిన వారి సాయంతో ఈ ఆహారాన్ని తయారు చేసి మరీ భోజనాలు ఏర్పాటు చేశారు. మీల్స్ తయారయిన తరువాత ఆ మొత్తాన్ని తీసుకుని స్కాంబర్గ్ లోని మై స్టార్వింగ్ చైల్డ్ కు నాట్స్ విరాళంగా అందించి తమ ఉదారతని చాటుకున్నారు.