కాలుష్య ప్రభావం... ఢిల్లీ ని వీడనున్న సోనియా!

కాలుష్యం గురించి మాట్లాడుకుంటూ మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ నగరం.ఢిల్లీ లో కాలుష్య ప్రభావం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

 Poor Air Quality Forces Sonia Gandhi To Shift Out Of Delhi On Doctors’ Advice,-TeluguStop.com

ప్రతి ఒక్కరూ కూడా కాలుష్య ప్రభావం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఢిల్లీ కాలుష్య ప్రభావం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై కూడా పడినట్లు తెలుస్తుంది.

గత కొంతకాలంగా ఆమె ఛాతి ఇన్స్పెక్షన్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా ఆ సమస్య తో బాధపడుతుండడం తో ఆమె కొంతకాలం ఢిల్లీ నగరానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

ఈ క్రమంలో ఆమె గోవా లేక చెన్నైలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ ని వీడనున్నట్లు తెలుస్తుంది.

గత కొంత కాలంగా సోనియా ఛాతీ ఇన్ఫెక్షన్‌ కారణంగా దాదాపు పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్న విషయం తెలిసిందే.ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఆమె ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడం తో వైద్యులు స్థానమార్పు సూచించినట్లు తెలుస్తుంది.

గత కొంతకాలంగా వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఇన్ఫెక్షన్‌లో తగ్గుదల కనిపించకపోవడంతో వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.దిల్లీ కాలుష్యం ఆమె అనారోగ్యాన్ని మరింత తీవ్రం చేసిందని, అందుకే కొంతకాలం పాటు ఆమె బయటి ప్రాంతానికి వెళ్లాలని వైద్యులు సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Delhi, Ganga Ram, Rahul Gandhi, Soina Gandhi, Sonia Gandhi-Telugu Politic

ఈ ఏడాది జులైలో ఆమె అనారోగ్యం బారిన పడడం తో గంగారామ్ ఆసుపత్రిలో సోనియా కొంతకాలం చికిత్స కూడా తీసుకున్నారు.అనంతరం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్‌ 12న అమెరికా వెళ్లారు.అప్పుడు ఆమె వెంట రాహుల్ కూడా ఉన్నారు.అయితే, ఆ సమయంలోనే కరోనావైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన వర్షాకాల సమావేశాలకు కూడా వీరు హాజరు కాలేకపోయారు.

అయితే దీర్ఘకాలంగా ఆమె ఇంకా ఆ సమస్యను ఎదుర్కొంటుండడం తో వైద్యులు పై మేరకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది.దీనితో మరి ఆమె చెన్నై లో ఉంటారా లేదంటే గోవా లో ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube