భర్తపై పెట్టిన కేసు వాపస్ తీసుకున్న పూనమ్ పాండే  

Poonam Pandey takes a U-turn on Husband, Bollywood, Celebrity Lifestyle, Adult Star, Poonam Pandey - Telugu Adult Star, Bollywood, Celebrity Lifestyle, Poonam Pandey, Poonam Pandey Takes A U-turn On Husband

ఇండియన్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా తన హాట్ ఫొటోలతో సెన్సేషన్ గా మారిన ఈ భామ ఈ మధ్య అడల్ట్ స్టార్ గా అవతారం ఎత్తింది.

TeluguStop.com - Poonam Pandey Takes A U Turn On Husband

తన పేరుతో ఒక యాప్ స్టార్ట్ చేసి అందులో తన అడల్ట్ వీడియోలని షేర్ చేస్తూ అభిమానులకి కావాల్సినంత వినోదం అందిస్తుంది.తాజాగా ఈ భామ తన చిరకాల ప్రేమికుడు సామ్ బాంబేని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం గోవా వెళ్లారు.

అయితే అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నపళంగా ఫోన్ చేసి అక్కడి పోలీసులకి తన భర్త మీద ఫిర్యాదు చేసింది.తన ప్రమేయం లేకుండా సామ్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, భౌతికంగా దాడి చేసి మొహంపై కొట్టాడని, అత్యాచారం చేసే ప్రయత్నం చేసాడని ఫిర్యాదు చేసింది.

TeluguStop.com - భర్తపై పెట్టిన కేసు వాపస్ తీసుకున్న పూనమ్ పాండే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమె ఫిర్యాదుతో గోవా పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేశారు.

రెండు రోజుల తర్వాత అతను బెయిల్ మీద బయటకి వచ్చాడు.

అయితే కేసు పెట్టి అతను తనని వేధించాడని, విడాకులు తీసుకుంటానని చెప్పిన పూనమ్ పాండే సడెన్ గా యూటర్న్ తీసుకుంది.తన మనసు మార్చుకొని భర్తపై పెట్టిన కేసు వాపస్ తీసుకుంది.

అతను తన దగ్గరకి వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడని, దీంతో కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు.అయితే సామ్ ఇలా ఏడ్వ‌డం ఇది కొత్తేమి కాద‌న్నారు.

గ‌తంలో కూడా త‌న‌ను కొట్టి, మ‌ళ్లీ ఇలాంటి త‌ప్పు చేయ‌న‌ని ఏడ్చేవాడ‌ని ఆమె చెప్పుకొచ్చారు.అతనితో విడాకులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పూనమ్ పాండే చెప్పుకొచ్చింది.

#Poonam Pandey #PoonamPandey #Adult Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poonam Pandey Takes A U Turn On Husband Related Telugu News,Photos/Pics,Images..