అందుకే ఆ స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తోందంట...

తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన “జల్సా” చిత్రం ఎంత మంచి హిట్ అదో య్యింఅందరికీ బాగా తెలుసు.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గోవా బ్యూటీ ఇలియానా, పార్వతీ మెల్టన్ నటించారు.

 Poonam Kaur, Tollywood Actress, Pawan Kalyan,  Jalsa Movie Heroine Trolls, Trivk-TeluguStop.com

అయితే అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించి నటువంటి హీరోయిన్ ఎంపిక విషయంలో పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందినటువంటి పూనమ్ కౌర్ ని ముందుగా జల్సా చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారని కానీ ఏమైందో ఏమోగానీ కొన్ని కారణాల వల్ల పూనమ్ కౌర్ స్థానంలో గోవా బ్యూటీ ఇలియానా ని తీసుకున్నారని సోషల్ మీడియాలో బలంగా చర్చించుకుంటున్నారు.దీంతో అప్పటి నుంచి పూనమ్ కౌర్  పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఇటీవలే జల్సా చిత్ర హీరోయిన్ విషయంలో తనపై వస్తున్నటువంటి వార్తలపై స్పందించింది.

ఇందులో భాగంగా అప్పట్లో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి “జల్సా” చిత్రంలో తనకి అవకాశం ఇవ్వక పోవడంతో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసింది.

దీంతో పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ ని మోసం చేశాడని వస్తున్నటువంటి వార్తలకి దాదాపుగా పుల్ స్టాప్ పడింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు.

ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా టార్గెట్ చేయకపోతే గతంలో మీరు ఎవరిపై ఇంతటి కఠిన వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ నెటిజన్లు పూనమ్ కౌర్  ని ప్రశ్నిస్తున్నారు.మరి ఈ ప్రశ్నలకి పూనం కౌర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube