ఫోటో షేర్ చేసిన పూనమ్ కౌర్.... అక్కడ టాటూ బాగుందంటున్న నెటిజన్లు...  

తెలుగులో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించినటువంటి “మాయాజాలం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకో లేకపోయింది.

TeluguStop.com - Poonam Kaur Tattoo Photos Viral In Internet

దీంతో తనకంటూ సినీ కెరీర్ లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే ప్రస్తుతం పూనమ్ కౌర్ సినిమా షూటింగులు లేక ఇంటి వద్దనే  ఉంటోంది.

TeluguStop.com - ఫోటో షేర్ చేసిన పూనమ్ కౌర్…. అక్కడ టాటూ బాగుందంటున్న నెటిజన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ  క్రమంలో తనఅందమైన  ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది. కాగా తాజాగా పూనమ్ కౌర్ తన లేటెస్ట్ ఫోటోలని అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

 ఇందులో పూనమ్ కౌర్ తన శరీరంపై ఉన్నటువంటి టాటూ బాగుందా అంటూ ఎక్స్ పోజ్  చేసింది. దీంతో కొందరు నెటిజన్లు టాటూ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన  విషయాలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల కొందరు సెలబ్రిటీలు  కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ ఫోటోలనుతొలగించాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూనమ్ కౌర్ హిందీలో “3 దేవ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

 కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఇటీవలే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Mayajalam #Poonam Kaur #PoonamKaur #PoonamKaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు