ఆ దర్శకుడు ఎవడో కాని మామూలోడు కాదు  

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈమద్య ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కాస్టింగ్‌ కౌచ్‌ సినిమా పరిశ్రమలో ఉందని అంతా అంటున్న మాట. కాని ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆ విషయమై నోరు ఎత్త లేదు...

ఆ దర్శకుడు ఎవడో కాని మామూలోడు కాదు-

ఇటీవల కొందరు ఆ విషయమై విమర్శలు చేస్తూ తమ గళం ఎత్తుతున్నారు. వారిలో శ్రీరెడ్డి ప్రథమంగా ఉంది. ఆమె కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో వణుకు మొదలు అయ్యింది.

గతంలో కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడ్డ వారు కూడా ఇప్పుడు ఏమవుతుందో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు.

తాజాగా హీరోయిన్‌ పూనం కౌర్‌ ఒక దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన సినిమాలను దర్శకత్వం చేయడంతో పాటు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన అమ్మాయిలను డైరెక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆయన డైరెక్షన్‌లో అమ్మాయిలు చెప్పింది చేయాల్సి ఉంటుంది.

అలా చేస్తే వారు ఇండస్ట్రీలో నాలుగు రోజుల పాటు ఉంటారు. అదే ఆయనకు ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో నిలవడమే కష్టం. అసలు గుర్తింపు రాకుండా చేయడంలో ఆయన సిద్ద హస్తుడు అంటూ చెప్పుకొచ్చింది...

ప్రస్తుతం ఒక తెలుగు సినిమా హీరోయిన్‌ వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తుంది. అయినా కూడా ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కారణం ఆ దర్శకుడు చెప్పినట్లుగా చేయడమే.

ఆయన మార్గ నిర్ధేశంలో ఆమె సినిమా కెరీర్‌ కొనసాగుతుంది. ఆమె తన స్వాభిమానంను, తన మానంను పక్కకు పెట్టడం వల్ల అవకాశాలు దక్కించుకుంటుంది అంటూ పూనం చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పిన పూనం కౌర్‌ ఆ దర్శకుడి పేరు మాత్రం రహస్యంగా ఉంచింది.

సమయం వచ్చినప్పుడు అతడి పేరును రివీల్‌ చేస్తాను అంటున్న పూనం అసలు విషయాన్ని చెప్పకుండా దాటవేస్తూ వచ్చింది.

తనను ఆ దర్శకుడు మార్చాలని, ఏమార్చాలని ప్రయత్నించినా కూడా తాను లొంగలేదు అని, అందుకే తాను అవకాశా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను కూడా ఆ దర్శకుడు చెప్పినట్లుగా చేసి ఉంటే చిన్నవో లేదా పెద్దవో అవకాశాలు మాత్రం వచ్చేవి అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి పూనం కౌర్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరై ఉంటారు, అంతటి తోపు దర్శకుడు ఎవడా అని చర్చించుకుంటున్నారు.