ఎన్టీఆర్ ఘాట్ లో ఒంటరిగా కనిపించిన పూనమ్ కౌర్  

Poonam Kaur Ntr Ghat - Telugu Nandamuri Family, Pawan Kalyan, Poonam Kaur Visits Ntr Ghat, South Cinema, Telugu Cinema, Tollywood

ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న నటి పూనమ్ కౌర్.చేతిలో సినిమాలు లేకపోయినా కూడా ఈమె పెట్టె ట్వీట్ లకి, ఈమె యాక్టివిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

 Poonam Kaur Ntr Ghat

పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఈమె పేరు ప్రముఖంగా వినిపించడంతో మొత్తం మీడియా ఎక్కువగా పూనమ్ ని ఫోకస్ చేస్తూ వస్తుంది.ఇక అందుకు తగ్గట్లే ఆమె యాక్టివిటీస్ కూడా ఎక్కువగా మీడియా దృష్టిలో పడే విధంగానే ఉంటున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి పలువురు వచ్చి నివాళి అర్పించారు.అందులో పూనమ్ కౌర్ కూడా ఉండటం విశేషం.

ఎన్టీఆర్ ఘాట్ లో ఒంటరిగా కనిపించిన పూనమ్ కౌర్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ అమ్మడు ఎన్టీఆర్ ఘాట్‌కు ఒంటిరిగా వెళ్లి నివాళులు అర్పించారు.అనంతరం ఎన్టీఆర్‌కు అంజలి ఘటిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

నివాళులు అర్పించిన అనంతరం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజల దేవుడు అని అభివర్ణించింది.స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి.దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి.మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది అని తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు పలువురు నందమూరి వీరాభిమానులు స్పందిస్తూ మీరు నిజంగా గ్రేట్ మేడం అని ప్రశంసలతో ముంచెత్తుతుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ సడెన్ గా పూనమ్ కౌర్ కి ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటూ చర్చించుకుంటున్నారు.అయితే ప్రజల దృష్టిలో పడతానికే పూనమ్ ఇలా మీడియా ఫోకస్ తన మీద పడేలా ఎప్పుడు లేని విధంగా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్ళింది అని చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poonam Kaur Ntr Ghat Related Telugu News,Photos/Pics,Images..

footer-test