జాతీయ స్థాయిలో గుర్తింపుకి అడుగు దూరంలో పూనమ్ కౌర్  

Poonam to be a national brand ambassador for Handlooms,Poonam Kaur , national identity, AP Politics, Tollywood, Handicraft Cloths - Telugu Ap Politics, Handicraft Cloths, Poonam Kaur To Get National Identity, Tollywood

సినిమాల ద్వారా కంటే ఎక్కువగా ఏపీ రాజకీయాలు, వివాదాస్పద ట్వీట్ లతో పాపులర్ అయిన నటి పూనమ్ కౌర్.ఈ అమ్మడుని గత ఎన్నికలకి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఇతర పార్టీల వారు ఒక అస్త్రంగా వాడుకున్నారు.

TeluguStop.com - Poonam Kaur National Brand Ambassador Handlooms

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఆ పార్టీలకి చెందిన మీడియా చానల్స్ కూడా పూనమ్ కౌర్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆమె ఏదైనా ట్వీట్ చేసిన కూడా దానిని బూతద్దంలో పెట్టి చూపిస్తూ ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ కి ఆపాదిస్తూ ప్రాజెక్ట్ చేసేవారు.ఇక ఎన్నికల తర్వాత ఆమె ట్వీట్ లతో సోషల్ మీడియాలో ఎక్కువగా అందరి దృస్టిని ఆకర్షించింది.

TeluguStop.com - జాతీయ స్థాయిలో గుర్తింపుకి అడుగు దూరంలో పూనమ్ కౌర్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఆమెకి ఆ పదవి పవన్ కళ్యాణ్ దయ వల్ల వచ్చింది అని చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.

ప్ర‌భుత్వ హ‌యాంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేనేత బ్రాండ్ లని ప్రమోట్ చేసిన పూన‌మ్ కౌర్ ని వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించింది.అయితే తాజాగా పూన‌మ్ కౌర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన‌ట్టు తెలుస్తోంది.

భార‌తీయ ఉత్ప‌త్తులకు ఆద‌ర‌ణ క‌ల్పించ‌డంలో త‌న వంతు కృషి చేస్తున్న‌ పూన‌మ్ కౌర్ ను భార‌తీయ చేనేత, వ‌స్త్ర ప‌రిశ్ర‌మ జాతీయ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ మేర‌కు పూన‌మ్ కౌర్ పేరును సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ప్ర‌ధానమంత్రి కార్యాల‌యానికి పంపిన‌ట్టు టాక్ వినిపిస్తుంది.

త్వరలో దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే దీని వెనుక కూడా జనసేనాని హస్తం ఉందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

#PoonamKaur #AP Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poonam Kaur National Brand Ambassador Handlooms Related Telugu News,Photos/Pics,Images..