వర్మపై మండిపడుతున్న బ్యూటీ.. ఎవరంటే?  

Poonam Kaur Fires On Rgv New Film - Telugu Poonam Kaur, Power Star, Ram Gopal Varma, Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కాడు.ఇటీవల ఆయన ‘నగ్నం’ అనే సినిమాను తరకెక్కించిన సంగతి తెలిసిందే.

 Poonam Kaur Fires On Rgv New Film

కాగా తాజాగా తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఆయన అనౌన్స్ చేశాడు.గతంలో మెగా ఫ్యామిలీపై ఓ సినిమా చేస్తానని ప్రకటించిన వర్మ, ఎందుకో ఆ సినిమా ఊసే ఎత్తలేదు.

కానీ ఈసారి ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే ‘పవర్ స్టార్’ అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు.

వర్మపై మండిపడుతున్న బ్యూటీ.. ఎవరంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఈ సినిమా ఉండబోతున్నట్లు పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

అయితే ఎవరినీ ఉద్దేశించి తాను ఈ సినిమాను చేయడం లేదని చెబుతున్నాడు వర్మ.‘‘ఈ సినిమాలో పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యా మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు మరియు ఆర్జీవీ ఉంటారు’’ అంటూ వివాదాస్పద ట్వీట్ చేశాడు వర్మ.

అంతేగాక ఈ సినిమాలో నటించబోయే హీరో తనకు దొరికాడంటూ అతడి వీడియోను కూడా ట్వీట్ చేశాడు.

ఈ వివాదాస్పద సినిమాతో ఆర్జీవీ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలపాలని టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ డిమాండ్ చేస్తోంది.

అమ్మాయిల ఎమోషనల్ బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించే ఆర్జీవీ అనే పాత్రను కూడా ఈ సినిమాలో పెట్టాలని ఆమె కోరుతుంది.తాను చిన్నతనంలో వర్మను గౌరవించానని, ప్రస్తుతం ఆయన్ను చూస్తే చీదరింపు కలుగుతోందని పూనమ్ మండి పడుతోంది.

మొత్తానికి వర్మ మరోసారి పవన్ కళ్యాణ్‌పై సినిమా చేస్తూ టాలీవుడ్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poonam Kaur Fires On Rgv New Film Related Telugu News,Photos/Pics,Images..

footer-test