తప్పుడు వార్తలపై సైబర్ క్రైమ్ ని ఆశ్రయించిన పూనమ్ కౌర్  

తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన యుట్యూబ్ చానల్స్ పై ఫిర్యాదు చేసిన పూనమ్ కౌర్. .

Poonam Kaur Files Complaint On Few Channels-social Media,tollywood, Channels

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన నటి పూనమ్ కౌర్. రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి చాలా మంది సోషల్ మీడియాలో, యుట్యూబ్ చానల్స్ లో పూనమ్ కౌర్ మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసారు. ఇప్పుడు అలాంటి వాటిపై పూనమ్ కౌర్ ఎదురుదాడి చేయడానికి రెడీ అయ్యారు...

తప్పుడు వార్తలపై సైబర్ క్రైమ్ ని ఆశ్రయించిన పూనమ్ కౌర్-Poonam Kaur Files Complaint On Few YouTube Channels

ఆమె మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ ఛానెళ్లలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వాటి లిస్టుతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకి ఇచ్చారు. యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ తన వ్యక్తిగత స్వేచ్చ, గౌరవంకి భగం కలిగించే విధంగా వ్యవహరించారని, అలాగే తన పేరుతో ఓ తప్పుడు ఆడియో టేపులు కూడా ప్రసారం చేసారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.