పూనమ్ కౌర్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించి నటిగా గుర్తింపును సంబంధించుకున్నారు పూనమ్ కౌర్.శ్రీకాంత్ హీరోగా నటించిన మాయాజాలం సినిమాతో టాలీవుడ్ కు పరిచమయమైన పూనమ్ కౌర్ ఆ సినిమా తరువాత ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మిగాడి కథ, ఆడు మగాడ్రా బుజ్జి, నాయకి మరికొన్ని సినిమాల్లో నటించారు.

 Poonam Kaur Did Not Wish For Ugadi And Wish For Ramadan-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా పూనమ్ కౌర్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.తాజాగా వకీల్ సాబ్ సినిమా టికెట్ల విషయంలో కూడా పూనమ్ కౌర్ స్పందించారు.

అయితే పూనర్ కౌర్ ఒక పండుగకు శుభాకాంక్షలు తెలిపి మరో పండుగకు శుభాకాంక్షలు తెలపకపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.ఉగాది పండుగకు శుభాకాంక్షలు తెలపని పూనమ్ కౌర్ రంజాన్ మాసం ప్రారంభం కాబోతూ ఉండటంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

 Poonam Kaur Did Not Wish For Ugadi And Wish For Ramadan-పూనమ్ కౌర్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రంజాన్ పండుగకు శుభాకాంక్షలు తెలిపి ఉగాది పండుగకు శుభాకాంక్షలు తెలపకపోవడం గురించి పూనమ్ కౌర్ స్పందించి వివరణ ఇచ్చారు.సరిహద్దులలో రైతులు నిరసన చేస్తుండటంతో ఉగాది పండుగకు విషెస్ చెప్పలేదని ఆమె అన్నారు.

రైతులు సరిహద్దులలో కష్టాలు పడుతుంటే తాను పండుగ శుభాకాంక్షలు ఎలా చెబుతానని ఆమె ప్రశ్నించారు.రైతుల బాధల గురించి ఆలోచించరా.? అంటూ నెటిజన్లకు ఆమె రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు.

అయితే పూనమ్ కౌర్ వివరణతో నెటిజన్లు సంతృప్తి చెందలేదు.

మీకు ఇప్పుడే రైతులు గుర్తుకు వచ్చారా.? అంటూ నెటిజన్లు రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు.పండుగకు శుభాకాంక్షలు చెప్పకపోవడం వల్ల పూనమ్ కౌర్ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.పండుగకు శుభాకాంక్షలు చెప్పకపోవడం వల్ల మొదలైన వివాదానికి పూనమ్ కౌర్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.

#Ugadi #Twitter Post #Poonam Kaur #Ramadan #Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు