నీకు అది చేయడమే తెలుసు అంటూ పూనమ్ కౌర్ ఫైర్.. ఎవరినంటే?

నటి పూనమ్ కౌర్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిన ఈ స్టార్ హీరోయిన్ ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో కనుమరుగైంది.

 Poonam Kaur Latest Tweet On Copy Master Viral,poonam Kaur ,pawan Kalyan, Trivikr-TeluguStop.com

ఆ తరువాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించినా అవి సూపర్ హిట్ కాకపోవడంతో మరల స్టార్ గా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోలేక పోయింది.అయితే నటిగా సినిమా ప్రేక్షకులకు సుపరిచితం అయిన నటి ఏదో ఒక విషయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

అప్పట్లో పవన్ కళ్యాణ్ కు, పూనమ్ కౌర్ కు మధ్య ఎఫైర్ నడించిందని, ఆ తరువాత అనివార్య కారణాల వల్ల వీరు విడిపోయారని, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కలగజే సుకొని పూనమ్ కౌర్ ని ఏవేవో అన్నాడని చెప్పి తన ట్వీట్స్ ద్వారా గురూజీ, పెద్ద డైరెక్టర్ అంటూ త్రివిక్రమ్ అని అర్ధం వచ్చేలా అసలు నిజం దాస్తూ ట్వీట్స్ చేసింది.అయితే తాజాగా చేసిన మరో ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నువ్వో కాపీ మాస్టర్ ఎదుటి వారి ఐడియాలను కాపీ కొట్టి నీవని ప్రచారం చేసుకుంటావ్, నా దగ్గర నుండి అన్నీ లాగేసుకున్నావ్, నా ఐడియాలను దోచుకున్నావ్ నిన్ను ఎవరు క్షమించరు కాపీ మాస్టర్ అంటూ పూనమ్ తన ట్వీట్  రూపంలో ఫైర్ అయ్యింది.ఇక కాపీ మాస్టర్ అన్నది ఎవరిని అని నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube