చికాగో సెక్స్‌ రాకెట్‌.. కిషన్‌, చంద్రల గురించి షాకింగ్‌ విషయం       2018-06-29   02:58:19  IST  Raghu V

అమెరికాలో తెలుగు సినీ తారలు, బుల్లి తెర తారలు వ్యభిచారం చేస్తున్నట్లుగా అక్కడ పోలీసులు గుర్తించారు. వారితో కిషన్‌ మరియు ఆయన భార్య చంద్రకళలు డబ్బు ఇచ్చి ఒప్పించి లేదంటే బలవంతంగా వ్యవభిచారం చేయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడైంది. చాలా సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో అక్కడ పోలీసులు లోతుగా అద్యయం చేస్తున్నారు. ఇన్నాళ్లు కిషన్‌, చంద్రలు పెద్ద మనుషుల ముసుగులో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల పేరుతో వారు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావని వెళ్లడైంది.

తెలుగు సంఘాల పేర్లతో ఏదో ఒక కార్యక్రమం ఉందంటూ తెలుగు సినీ తారలను పిలిపించుకుని, అక్కడ వారితో బలవంతంగా వ్యవభిచారం చేయించడంతో పాటు, వారిని శారీరకంగా మరియు మానసికంగా చిత్రవదలు చేయడం చేశారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్‌, ఎంతో మంది బుల్లి తెర స్టార్స్‌ కూడా వీరికి బలి అయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే అందులో ఒక్కరు ఇద్దరు మినహా ఎవరు కూడా బయటకు రావడం లేదు. అయినా కూడా కిషన్‌ రాసుకున్న డైరీతో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.

ఇక కిషన్‌, చంద్రలు అనే భార్యభర్తలు ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అంటూ మొదటి రోజు నుండి కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు మరియు ఎంక్వౌరీ అధికారులు కూడా కిషన్‌ మరియు చంద్రాలను భార్య, భర్తలుగా భావిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరు నిజంగా భార్యభర్తలు కారని, వారు సహజీవనం సాగిస్తున్నారని హీరోయిన్‌ పూనం కౌర్‌ చెప్పుకొచ్చింది. చాలా కాలం క్రితం వీరి సహజీవనం ప్రారంభం అయ్యింది. ఎంతో మందిని మోసం చేసుకుంటూ వీరు జీవిస్తూ వస్తున్నారు. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డ వీరు ఈజీ మనీకోసం ఈ మార్గంను ఎంచుకున్నారు.

పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్లుగా నటిస్తూ వస్తున్నారు. వీరిద్దరు కూడా గత కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నారు. అయినా కూడా వీరి వివాహం గురించి కాని, వీరిద్దరి బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి కాని అక్కడ వారు ఎవరు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీరిద్దరు అంతగా కలిసి పోయారు అంటూ పూనం చెప్పుకొచ్చింది. తన వద్దకు ఒక మనిషిని పంపించి, వ్యభిచారంకు ఓకే చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేశారని, తాను అతడి చెంప పగుల కొట్టి అక్కడి నుండి పంపించాను అంటూ పూనం సంచలన విషయాలను బయట పెట్టింది. పోలీసుల విచారణలో మాత్రం వీరిద్దరు భార్య భర్తలు అంటూ చెబుతూ వస్తున్నారు. మరి పూనం కౌర్‌ వ్యాఖ్యల్లో ఏమేరకు నిజం ఉందనే విషయం చూడాలి.