పూనమ్ కౌర్ - పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ : విషెస్ ని లైక్ చేసినా తప్పేనా...?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఒక విషయం తెలిసిందంటే చాలు ఇట్టే వైరల్ అవుతోంది.దీనికితోడు కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా సినీ సెలబ్రిటీల గురించి అసత్య కథనాలను మరియు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

 Poonam Kaur And Pawan Kalyan Controversy Viral In Social Media, Poonam Kaur,  Te-TeluguStop.com

కాగా ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో భారీగా సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే పవన్ పుట్టినరోజు కావడంతో హరీష్ శంకర్ కూడా తన తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

అయితే టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు.కానీ ఇతర సెలబ్రిటీలు తెలిపిన శుభాకాంక్షల పోస్టులను ట్విట్టర్ లో లైక్ చేసిందని దాంతో కొందరు పవన్ కళ్యాణ్ నెగిటివ్ అభిమానులు పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్ అంటే పడదని దాంతో డైరెక్ట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయకుండా ఇలా ఇతరులు చేసిన పోస్టులను లైక్ చేసి పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిందంటూ ప్రచారాలు చేస్తున్నారు.

కానీ ఇప్పటివరకు పూనమ్ కౌర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు సరికదా పట్టించుకోవడం కూడా లేదు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Telugu Pawan Kalyan, Pawankalyan, Poonam Kaur, Poonamkaur, Telugu, Tollywood-Mov

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఈ ఏడాదిలో వకీల్ సాబ్ చిత్రంతో మంచి హిట్ ని అందుకుని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “హరిహర వీరమల్లు” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా యంగ్ బ్యూటీ “నిధి అగర్వాల్” నటిస్తుండగా ప్రముఖ సినీ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” దర్శకత్వం వహిస్తున్నాడు.

గబ్బర్ సింగ్ చిత్రంతో మంచి హిట్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా మరో చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు.దీంతో గత మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకి దూరంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు కానీ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్నట్లు తెలియడంతో పండగ చేసుకుంటున్నారు.

మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube