పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే.. కన్ఫార్మ్ అయినట్టేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

 Pooja To Confirm For Pawan Kalyan-TeluguStop.com

చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చినటువంటి వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించింది.

ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లుసాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్” వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

 Pooja To Confirm For Pawan Kalyan-పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే.. కన్ఫార్మ్ అయినట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి వదీయుడు భగత్‌సింగ్‌అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నటించడం కోసం కథానాయిక ఎవరనే విషయంపై చిత్రబృందం హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu @poojahegde, Bhagavadeeyudu Bhagath Singh, Bheemla Nayak, Harish Shanker, Pawan Kalyan, Tollywood, Trivikram-Movie

ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్నటువంటి పూజా హెగ్డేను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే పూజా హెగ్డే ను సంప్రదించిన దర్శకుడు హరీష్ శంకర్ ఆమెతో సంప్రదింపులు జరిపారని ఆల్మోస్ట్ ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో చేయడానికి ఆమె సానుకూలంగా ఉన్నప్పటికీ అడ్వాన్స్ తీసుకోకపోవడంతో ఈ సినిమాకు ఒప్పుకుంటారా లేదా .అనే విషయం తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో నటించడానికి పూజాహెగ్డే ఒప్పుకుంటే పవన్ తో ఇదేతన తొలి చిత్రం.ఇకపోతే ప్రస్తుతం పూజాహెగ్డే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ రాధేశ్యామ్ మెగాస్టార్ ఆచార్య సినిమాలలో నటించారు.

ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

#@PoojaHegde #Bheemla Nayak #Harish Shanker #Trivikram #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు