హౌస్ లో సెపరేట్ బాత్రూమ్స్ ఉండగా, కౌశల్ లేడీస్ బాత్రూం ఎందుకు వాడుతున్నాడు?   Pooja Ramachandran Verses Kaushal Bigg Boss Telugu     2018-08-10   09:50:51  IST  Sainath G

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 61 ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ఏమైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ తో స్టార్ట్ అయిన ఈ షోలో కౌశల్ ని టార్గెట్ చేయడం తప్ప కొత్తగా ఏం జరగట్లేదు. కౌశల్ ని టార్గెట్ చేయడం చివరికి కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అవ్వడం కామన్ అయిపొయింది. మరి ఈ సారి కౌశల్ తో గొడవ పెట్టుకుంది పూజ. ఇక కౌశల్ ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ ఆమెనె.!

అసలు విషయానికి వస్తే..హౌస్‌లో ఏకాకిగా ఉన్న కౌశల్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది పూజా. హౌస్‌లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నాడంటూ గీతా మాధురికి కంప్లైంట్ చేసింది పూజా. పురుషులకు సెపరేట్‌గా మహిళలకు సెపరేట్‌గా బాత్ రూమ్‌లు ఉన్నా అతడు లేడీస్ బాత్‌ రూమ్స్ వాడటం ఏంటని ఇది నాకు నచ్చలేదన్నది పూజా. దీనిపై రియాక్ట్ అయిన గీతా మాధురి ఈ విషయంలో నవ్వాలో ఏడవాలో తెలియడం లేదంటూ గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్‌ చేసిందని.. ఇది తొలిసారి కాదంటూ కౌశల్‌పై అడిగే ప్రయత్నం చేసింది గీతా మాధురి. అయితే కౌశల్ నుండి సరైన స్పందన లేకపోవడంతో మధ్యలోనే వెనుతిరిగింది గీతా.

Pooja Ramachandran Verses Kaushal Bigg Boss Telugu-

ఇక టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశన్‌ని ఏకాకిని చేస్తూ గేమ్‌లో కాయిన్స్‌ని దొంగతనం చేయడం తప్పూ అంటూ బాబు గోగినేని నేతృత్వంలో మూకుమ్మడి దాడి చేశారు. తనీష్, గణేష్, బాబు గోగినేని, రోల్ రైడా, సామ్రాట్, అమిత్‌లు నువ్ దొంగతనం చేయడం తప్పు అంటూ కౌశల్ తీసుకొచ్చిన 40 కాయిన్స్‌ని వెనక్కి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కౌశల్‌కు మిగిలిన కంటెస్టెంట్స్‌కి మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను గేమ్ లో భాగంగానే మహిళల్ని అలర్ట్ చేసేందుకే కాయిన్స్ తీసుకున్నానని అంతేతప్ప దొంగిలించాలనేది తన ఉద్దేశం కాదన్నారు. తనకూ మహిళలంటే గౌరవం ఉందని పురుషులు మహిళలు సమానమే అంటూ స్పీచ్ ఇచ్చారు. నేను ఆ కాయిన్స్ తీసుకోవడం తప్పైతే మరి పూజా పడేసిన కాయిన్స్ తీసుకున్న తనీష్‌ది తప్పు కాదా అంటూ తాను చేసిన పనిని సమర్ధించుకుంటూ తాను తీసుకున్న గోల్ట్ కాయిన్స్ వెనక్కి ఇచ్చేయడంతో పాటు.. మహిళలు పురుషులతో సమానం అని వాళ్ల గెలివాలని కోరుకుంటూ తన వద్ద ఉన్న 15 గోల్డ్ కాయిన్స్‌ను మహిళకు ఇచ్చారు కౌశల్. దీంతో మహిళలు అందరు కౌశల్ కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.