హను దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ కథకి ఒకే చెప్పిన పూజా బేబీ

టాలీవుడ్ లో వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మంగళూరు భామ పూజాహెగ్డే.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అఖిల్ తో, అలాగే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తుంది.

 Pooja Hegde's Next To Be A Women-centric Film, Tollywood, South Cinema, Hanu Rag-TeluguStop.com

ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తాయి.ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది.

ఓవరాల్ లో ఈ అమ్మడు ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉంది.అయితే తాజాగా ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఇది కమర్షియల్ జోనర్ సినిమా కాదనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేసిన పూజాహెగ్డే కి ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలే వచ్చాయి.

ఏ ఒక్కదానిలో కూడా ఏదో సాంగ్స్ కి పరిమితం అయ్యే పాత్ర అని లేదు.అయితే ఈ సారి తన నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి రెడీ అవుతుంది.

ఇందులో భాగంగా మహిళా ప్రధాన చిత్రానికి ఈ అమ్మడు గ్రీన్‌సిగల్‌ ఇవ్వడం విశేషం.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో పూజా బేబీ ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పింది.

ఇందులో ఆమె పోషించబోయే పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది.లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్మేంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube