పూజా హెగ్డే కట్టిన చీర రేటు అన్ని వేలా.. వామ్మో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే సెలబ్రిటీలు వారు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదైన ది మంచి బ్రాండ్ కు సంబంధించిన వాటిని ఉపయోగిస్తుంటారు.ఇలా వారి వస్తువుల కోసం అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయటం గురించి మనం వినే ఉంటాం.

 Pooja Hegde Yellow Color Dress Cost-TeluguStop.com

ఖరీదైన కార్లు బంగ్లాలు ఖరీదైన దుస్తులువంటి వాటి కోసం వేలల్లో లక్షల్లో ఖర్చు చేస్తూనే ఉంటారు.ఈ విధంగా ఖరీదైన, బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించే వారిలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒకరు.

తాజాగా పూజా హెగ్డే 2020 సైమా అవార్డ్ కార్యక్రమానికి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డే పసుపు రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి చూడటానికి ఎంతో సింపుల్ గా అందంగా ఉన్నారు.

 Pooja Hegde Yellow Color Dress Cost-పూజా హెగ్డే కట్టిన చీర రేటు అన్ని వేలా.. వామ్మో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ బుట్ట బొమ్మ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే వామ్మో అనక మానరు.ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర 48 వేల రూపాయలు.

పసుపు రంగు చీరను ధరించిన పూజా హెగ్డే నిజంగానే బుట్ట బొమ్మలా కనిపిస్తోంది.

Telugu 48 Thousand, About Saree, Coast, Dress Cost, Pooja Hegde, Tollywood, Yellow Colour Dress-Movie

ఈ క్రమంలోనే పూజా హెగ్డే నెలల కిందట లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.అందులో షో స్టాపర్ గా నిలిచిన పూజా హెగ్డే ఏకంగా రెండు లక్షలు విలువ చేసినటువంటి లెహంగా ధరించి సందడి చేశారు.ఇలా బుట్ట బొమ్మ ఉపయోగించే యాక్సెసరీస్ తన రేంజ్ కు తగ్గట్టుగానే ఉపయోగిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ప్రస్తుతం పూజా హెగ్డే చీరలో ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Cost #Yellow #Coast #Thousand #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు