గురూజీని బుట్టలో పడేస్తున్న బుట్టబొమ్మ

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే.ఈ అమ్మడు దువ్వాడ జగన్నాథమ్ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

 Pooja Hegde Wishes To Trivikram Srinivas, Tollywood, Telugu Cinema, South Heroin-TeluguStop.com

ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు చేస్తుంది.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.

మరో వైపు బాలీవుడ్ లో ఓ మూడు సినిమాల వరకు ఈ అమ్మడు కమిట్ అయ్యి ఉంది.అయితే పూజా హెగ్డే మాత్రం తనకి వరుసగా రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంది.

త్రివిక్రమ్ తో ఏ హీరో సినిమా చేసిన ఆటోమేటిక్ గా వారు మాటల మాంత్రికుడు ఫ్యాన్స్ అయిపోతారు.అలాగే హీరోయిన్లు కూడా మాటల మాంత్రికుడు చెప్పే మాటలకి ఫ్లాట్ అయిపోతారు.

పూజా హెగ్డే కూడా అలాగే రెండు సినిమాలకే మాటల మాంత్రికుడుకి ఫ్లాట్ అయిపోయి అతనితో ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.అందులో భాగంగా త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి ప్రత్యేకంగా విషెస్ చేస్తుంది.

చక్కని ప్రశాంతమైన, అత్యంత మనోహరమైన త్రివిక్రమ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.మీ అరవింద, అమూల్యగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు.

మీరు అల వైకుంఠపురంలో వివరించినప్పుడు ఇప్పటికీ గుర్తుంది.నవ్వడం ఆపలేకపోయాను.

మీకు మంచి సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అని విషెస్ చేసింది.గురూజీ సార్.

గురూజీ ఆంతే అంటూ పూజా కాస్త సరదాగా మాట్లాడేసింది.ఆయనతో ఆన్ లొకేషన్ ఫోటోని షేర్ చేసి, కన్ను గీటుతున్న ఒక ఈమోజీని, దండం పెడుతున్న ఈమోజీని సరదాగా ఫన్ కోసం పూజా హెగ్డే షేర్ చేసింది.

మొత్తానికి ఈ విషెస్ ద్వారా తారక్ తో త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం అమ్మడు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube