ధర్మస్తలిలోనే పూజా హెగ్డే, రామ్ చరణ్ ఆట, పాట

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

 Pooja Hegde Will Join Acharya Shooting This Month End-TeluguStop.com

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా నక్శలైట్ లీడర్స్ గా కనిపిస్తారని టీజర్, ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో సినిమా సెకండ్ హాఫ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

దేవాలయాల చుట్టూ ఈ కథని కొరటాల అల్లుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా కోసం ధర్మస్తలి అనే టెంపుల్ సెట్ ఒకటి వేశారు.

 Pooja Hegde Will Join Acharya Shooting This Month End-ధర్మస్తలిలోనే పూజా హెగ్డే, రామ్ చరణ్ ఆట, పాట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెజారిటీ షూటింగ్ ఈ టెంపుల్ సెట్ లోనే తెరకెక్కిస్తూ ఉండటంతో సినిమా బ్యాక్ డ్రాప్ కూడా అదే అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.

రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.

ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా రెమ్యునరేషన్ గట్టిగా ఇవ్వడంతో పాటు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న సినిమా కావడంతో ఎక్కువ ఆలోచించకుండా ఒకే చెప్పెసిందని బోగట్టా.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలని కొరటాల తెరకెక్కించారు.త్వరలో పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గోనబోతుందని తెలుస్తుంది.రామ్ చరణ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో సన్నివేశాలని, అలాగే పాటని దర్మస్తలి సెట్ లోనే చిత్రీకరించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల ఆఖరున పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Pooja Hegde #Ram Charan #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు