ట్రోలర్స్ చేతికి చిక్కిన పూజా హెగ్డే.. మరి అంత ఈజీగా వదిలేస్తారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

 Pooja Hegde To Trolls,  radhe Shyam, Prabhas, Pooja Hegdhe, Trolls, Radha Krish-TeluguStop.com

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

అందుకే రాధేశ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ మేకర్స్ బిజీగా ఉన్నారు.

Telugu Pooja Hegdhe, Prabhas, Radha Krishna, Radhe Shyam, Trolls-Movie

ఇక ఈ ప్రమోషన్స్ లో పూజా కూడా పాల్గొంటుంది.మార్చి 11 వరకు ఈమె ఎటు వెళ్ళడానికి లేకుండా లాక్ చేయడంతో తప్పక ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.అందులోను పూజా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

అయితే ఈమె ఎంత జాగ్రత్తగా ప్రమోషన్స్ చేసుకుంటూ పోతున్న ఎక్కడో ఒక చోట ట్రోలర్స్ కు చిక్కుతునే ఉంది.గత కొద్దీ రోజులుగా ప్రభాస్, పూజా లపై రూమర్స్ వస్తున్నాయి.

వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే మాట్లాడుకోవడం లేదని ప్రచారాం జరుగుతుంది.ఆ రూమర్స్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేసిన ట్రోలర్స్ మాత్రం వదలలేదు.

ఇక మరోసారి పూజా తన వ్యాఖ్యలతో ట్రోలర్స్ కు చిక్కింది.ఈమె ప్రమోషన్స్ లో భాగంగా ‘మీరందరు నా సక్సెస్ ఫుల్ లైఫ్ గురించి అడుగుతున్నారు’ అనబోయి ‘నా సెక్స్ లైఫ్‘ అని అంది.

Telugu Pooja Hegdhe, Prabhas, Radha Krishna, Radhe Shyam, Trolls-Movie

దీంతో ఈమె వెంటనే ఆ పదాన్ని సరిచేసుకుంది.అయినా కూడా ట్రోలర్స్ ఎందుకు వదులుతారు.ఇలాంటి స్టఫ్ దొరికిన తర్వాత కూడా ఆమెను వదలడం జరగని పని.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడంతో అందరి పూజా కావాలని అంది అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.ఇలాంటివి జరగడం అప్పుడప్పుడు సహజమే అని మరికొంత మంది చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube