మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ దర్శకడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో చరణ్ నటించబోయే పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో చరణ్ సరసన ఓ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పటినుండో చెబుతూ వస్తుంది.అయితే ఆ హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
కాగా ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, రష్మిక మందనల పేర్లు వినిపించినా వారికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డేను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
గతంలో ఆమె పేరు వినిపించగా, ఇప్పుడు దాదాపు ఆమెను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి పూజా హెగ్డేతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతుందని, త్వరలోనే ఈ సినిమాలో పూజాను కన్ఫం చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డేను చిత్ర యూనిట్ తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా గతంలో రంగస్థలం చిత్రంలో చరణ్‌తో కలిసి జిగేలు రాణిగా పూజా హెగ్డే చిందులు వేసిన సంగతి తెలిసిందే.