ఆచార్య మూవీకి పూజా హెగ్డే అంత తీసుకుంటోందా..?  

pooja hegde taking huge remuneration for acharya movie,tollywood,chiran jeevi, ram charan , poojahegdhe, gust role ,remunation, bollywood,achharya movie - Telugu Acharya Movie, Guest Role, Huge Remuneration, Pooja Hegde

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

TeluguStop.com - Pooja Hegde Taking Huge Remuneration For Acharya Movie

గతంలో రంగస్థలం సినిమాలో చరణ్ తో కలిసి జిగేలు రాణి పాటకు డ్యాన్స్ చేసిన పూజా హెగ్డే ఆ పాట ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డేకు ఆచార్య సినిమాలో సెకండాఫ్ లో చిన్న పాత్రలో నటించనున్నారు.

అయితే సాధారణంగా సినిమాల్లో గెస్ట్ రోల్ అంటే హీరోయిన్లు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు.అయితే పూజా హెగ్డే మాత్రం గెస్ట్ రోల్ అయినా సాధారణంగా తీసుకునే మొత్తమే ఇవ్వాలని కోరిందని ఆచార్య మేకర్స్ కూడా అందుకు అంగీకరించారని తెలుస్తోంది.పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తే మాత్రమే నటిస్తానని చెప్పగా డిమాండ్ ఉన్న హీరోయిన్ కావడంతో మేకర్స్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

TeluguStop.com - ఆచార్య మూవీకి పూజా హెగ్డే అంత తీసుకుంటోందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే ఆమె అడిగినంత ఇవ్వడానికి ఆచార్య మేకర్స్ ఓకే చెప్పారు.

సినిమాలో రామ్ చరణ్ పాత్ర 40 నిమిషాలు ఉండగా పూజా హెగ్డే పాత్ర 20 నిమిషాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.చరణ్ ఈ సినిమాలో సిద్ధా పాత్రలో నటిస్తున్నారు.

పూజా హెగ్డే ఈ సినిమాతో పాటు రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటిస్తున్నారు.ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

పూజా నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూ ఉండటంతో స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు తమ సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.ఒకవైపు తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉండటం గమనార్హం.

#Guest Role #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు