అక్షయ్ కుమార్ కు ఛాలెంజ్ విసిరిన పూజా హెగ్డే.. నెట్టింట్లో వైరల్?

Pooja Hegde Takes Green India Challenge

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకనిర్మాతలకు ఈమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

 Pooja Hegde Takes Green India Challenge-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె చేతి నిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇటీవలే ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాతో మరొక సక్సెస్ ఖాతాలో వేసుకుంది.

 Pooja Hegde Takes Green India Challenge-అక్షయ్ కుమార్ కు ఛాలెంజ్ విసిరిన పూజా హెగ్డే.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు విరామ సమయాల్లో టూర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇది ఇలా ఉంటే పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ జోరుగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే సుశాంత్ ఛాలెంజ్ ను స్వీకరించిన పూజా హెగ్డే మొక్కలు నాటింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సంతోష్ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ అభిమానులు కూడా కొనసాగిస్తారని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ఛాలెంజ్ ను కంప్లీట్ చేసిన పూజ హెగ్డే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రితీష్ దేశముఖ్ లను నామినేట్ చేసింది.తాజాగా ఈమె మాల్దీవుల పూర్తిచేసుకుని తిరిగి వచ్చింది.

ఈ క్రమంలోనే తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

#Green India #Akshay Kumar #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube