రెడ్ కార్పెట్ పై నడవడం కోసం లక్షలు ధారబోసిన పూజా హెగ్డే?

ముకుంద సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజాహెగ్డే అనంతరం పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ అనే బిరుదు సంపాదించుకున్నారు.

 Pooja Hegde Spent Lakhs Of Money To Walk In Red Carpet Pooja Hegde, Tollywood, Outfit, Black Heels, Price-TeluguStop.com

అయితే ఈమె నటించిన వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈమె వరుసగా నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు సౌత్ ఇండస్ట్రీ తరపున 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం చలన చిత్రోత్సవాలలో భాగంగా ఈమె ఫ్రాన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరిని సందడి చేస్తున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం రావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

 Pooja Hegde Spent Lakhs Of Money To Walk In Red Carpet Pooja Hegde, Tollywood, Outfit, Black Heels, Price-రెడ్ కార్పెట్ పై నడవడం కోసం లక్షలు ధారబోసిన పూజా హెగ్డే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే కేన్స్ రెడ్ కార్పెట్ పై పూజా హెగ్డే మెరవడం కోసం ఎంతో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.డిజైనర్ డ్రెస్ నుంచి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉండేలా చూసుకున్నారు.

ఈ క్రమంలోనే రెడ్ కార్పెట్ పై నడవడం కోసం ఈమె చెప్పుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపారు.ఈ క్రమంలోనే ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ఈమె రెడ్ కార్పెట్ పై నడవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఆ బ్యాగులను ఇండియా ఎయిర్ పోర్టులో పోగొట్టుకున్నానని వెల్లడించారు.ఇక అప్పటికప్పుడు ఫ్రాన్స్ లో తనకు కావాల్సిన వస్తువులన్నింటిని కొనుగోలు చేశానని చెప్పిన పూజాహెగ్డే తాజాగా ఎల్లో ఔట్ ఫిట్ డ్రెస్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఇకపోతే ఈ ఫోటోలో పూజా హెగ్డే ధరించిన చొప్పున ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.

వీటి ధర అక్షరాల  లక్ష 43 వేలట.ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో పూజా హెగ్డే రెడ్ కార్పెట్ పై నడవడం కోసం ఏకంగా అన్ని లక్షలు ధారపోసారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube