'విభా' రోల్ తర్వాత అంతా నా నటన గురించి మాట్లాడుతున్నారు : పూజా

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.ఈమె ప్రెసెంట్ సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Pooja Hegde Speech At Most Eligible Bachelor Success Meet,most Eligible Bachelor-TeluguStop.com

వరుస అవకాశాలను అందుకుంటూ అత్యధిక పారితోషికం కూడా తీసుకుంటుంది.ఇక ప్రెసెంట్ ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాతో హిట్ అందుకోవడంతో ఆనందంలో తేలిపోతున్నాడు.

అఖిల్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సెక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.

ఈ సక్సెస్ మీట్ లో పూజా మాట్లాడుతూ.ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు.ఆ సక్సెస్ లో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ఇంత బాగా రావడానికి టీమ్ అంత చాలా ఎఫర్ట్ చేసింది.

ఈ సినిమాలో భాగం అయినా ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ అంటూ చెప్పారు.

Telugu Grand, Poojahegde-Movie

ఇంకా ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్ కి నేను పెద్ద థాంక్స్ చెబుతున్నాను.ఈ సినిమాలో నేను విభా అనే బ్యూటిఫుల్ రోల్ లో నటించాను.నేను ఇంత వరకు చేసిన పాత్రలు గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే నాకు గుర్తింపు తెచ్చాయి.

ఈ సినిమాలో విభా రోల్ చేసిన తర్వాత మాత్రం అందరు నా నటన గురించి మాట్లాడు కుంటున్నారు.

Telugu Grand, Poojahegde-Movie

నా నటన బాగుందంటూ అందరు కాల్స్ చేసి పొగుడుతున్నారు.నిజంగా నాకు చాలా సంతోషంగా, గర్వంగా కేసుల ఉంది.విభా పాత్రను ఇంత గొప్పగా డిజైన్ చేసిన భాస్కర్ సార్ కి నేను థాంక్స్ చెప్పుకోవాలి.

తెలుగు దర్శకులు నాకు మంచి మంచి పాత్రలు రాసి నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్తున్నారు.ఇక అఖిల్ తో నా కెమిస్ట్రీ చాలా బాగుందని అంటునాన్రు ఆయన ఇచ్చిన కంఫర్ట్ కారణంగానే నేను అంత బాగా చేయగలిగాను.

యనతో మరొకసారి కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.అంటూ పూజా స్పీచ్ ముగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube